షిండే రాజీనామా మహా ముఖ్యమంత్రి ఎవరో?

కొనసాగుతున్న సస్పెన్ష్​ 

Nov 26, 2024 - 12:25
 0
షిండే రాజీనామా మహా ముఖ్యమంత్రి ఎవరో?

ముంబాయి: మహారాష్ట్ర సీఎం ఎవరన్న సస్పెన్ష్​ కొనసాగుతుంది. మంగళవారం సీఎం ఏక్​ నాథ్​ షిండే రాజ్​ భవన్​ కు వెళ్లి గవర్నర్​ కు రాజీనామా లేఖ సమర్పించారు. షిండే వెంట డిప్యూటీ సీఎం ఫడ్నవీస్​, అజిత్​ పవార్​ పలువురు పార్టీ నాయకులున్నారు. సీఎం ఫడ్నవీస్​ పేరును అజిత్​ పవార్​ అంగీకరించారు. అదే సమయంలో షిండే తన అభిప్రాయాన్ని వెల్లడించలేదు. మరోవైపు ఏక్​ నాథ్​ షిండేతో ఉద్ధవ్​ ఠాక్రే వర్గానికి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు కూడా టచ్​ లో ఉన్నట్లు తెలుస్తుంది. పార్టీని వీడనున్నారనే ప్రచారం జరుగుతుంది. షిండే మహిళల కోసం తీసుకువచ్చిన పథకం, మరాఠాల సపోర్ట్​ ఎక్కువగా ఉండడం వల్ల ఆయన్నే సీఎం చేయాలనే డిమాండ్​ లు కూడా ఉన్నాయి. కానీ ఎక్కడ కూడా ఈ ముగ్గురు నాయకులు సీఎం పదవిపై నోరు విప్పడం లేదు. బీజేపీ సొంతంగానే 132 స్థానాలను కైవసం చేసుకోగా, మహాయుతితో కలిపి 233 స్థానాలను కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో సీఎం పదవిని ఫడ్నవీస్​ కే దక్కేలా కేంద్రం చర్యలు తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇందుకు అజిత్​ పవార్​ కూడా ఒకే చెప్పారని సమాచారం. ఈ నేపథ్యంలో నంబర్​ గేమ్​ లో బీజేపీ పై చేయి సాధించడంతో ఫడ్నవీస్ సీఎం ఖాయమేనని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా ముగ్గురు నేతల మధ్య సీఎం సీటుపై సయోధ్య కుదిరినట్లు సమాచారం.