కశ్మీర్ లో గ్రౌండ్ రియాల్టీ భిన్నం
Ground realty fraction in Kashmir
ఐక్యరాజ్యసమితిలో పాక్ కు చురకలు
కాంగ్రెస్ నేత రాజీవ్ శుక్లా
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ఐక్యరాజ్యసమితిలో కశ్మీర్ అంశాన్ని పదేపదే లేవనెత్తుతున్న పాక్ పై రాజీవ్ శుక్లా విరుచుకుపడ్డారు. కశ్మీర్ లో గ్రౌండ్ రియాలిటీ పాక్ మాటలకు పూర్తి భిన్నంగా ఉందన్నారు. జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో ఓటింగ్ నమోదైందన్నారు. బుధవారం ఐక్యరాజ్య సమితిలో కాంగ్రెస్ నేత రాజీవ్ శుక్లా ప్రసంగిస్తూ పాక్ ను నిలదీశారు. కశ్మీర్ అంశంపై అసత్యాలు, అవాస్తవాలు వ్యాప్తి చేస్తూ పాక్ ఏం సాధించలేదని గుర్తుంచుకోవాలన్నారు. పాక్ బృందానికి విమర్శలే అలవాటుగా మారిపోయాయన్నారు. నిజనిజాలు అక్కరలేదన్నారు. ఫేక్ న్యూస్ ఎంతగా వ్యాప్తి చేసినా గ్రౌండ్ రియాల్టీ మారదన్నారు. ఐక్యరాజ్యసమితి వేదికను విమర్శలు, ఆరోపణలు, ప్రత్యారోపణలకు ఉపయోగించుకునేకంటే నిర్మాణాత్మక ఆలోచనలకు వేదికగా వాడుకుంటే పాక్ కు మేలని చురకలంటించారు. ఫేక్ వార్తలకు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారంలో యూఎన్ కు భారత్ మద్ధతు కొనసాగిస్తుందని రాజీవ్ శుక్లా స్పష్టం చేశారు.