పవిత్ర గ్రంథం రాజ్యాంగం

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మూ

Nov 26, 2024 - 13:12
 0
పవిత్ర గ్రంథం రాజ్యాంగం

రాజ్యాంగం ఏర్పడి 75యేళ్లు పూర్తి అయిన సందర్భంగా పార్లమెంట్​ భవన్​ లో వేడుకలు
స్టాంపు, నాణెం, పుస్తకాలు విడుదల
రాజ్యాంగానికి అనుగుణంగా మోదీ ప్రభుత్వం చర్యలపై హర్షం

నా తెలంగాణ, న్యూఢిల్లీ: బాబా సాహెబ్​ బీఆర్​ అంబేద్కర్​ రూపొందించిన భారతదేశ రాజ్యాంగం అత్యంత పవిత్ర గ్రంథమని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మూ అన్నారు. 75యేళ్ల క్రితం రూపొందించిన రాజ్యాంగం ప్రతీ వ్యక్తికి ఆత్మగౌరవాన్ని అందజేస్తుందన్నారు. ఈ చారిత్రాత్మక వేడుకలను పార్లమెంట్​ సాక్షిగా నిర్వహించుకోవడం హర్షదాయమని ముర్మూ తెలిపారు. రాజ్యాంగాన్ని రూపొందించిన మహానీయులందరికీ నివాళులర్పించారు. రాజ్యాంగ రూపకర్తలలో మహిళలు, తెరవెనుక అధికారుల పాత్ర ఉందన్నారు. 

దేశ రాజ్యాంగం ఏర్పడి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మంగళవారం న్యూ ఢిల్లీలోని ఓల్డ్ పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో ప్రత్యేక కార్యక్రమం జరిగింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ, ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌కర్, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా తోపాటు ఎంపీలు, మంత్రులు, ప్రతిపక్ష సభ్యులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. 

రాష్ట్రపతి ముర్మూ నాణెం, తపాలా స్టాంపును విడుదల చేశారు. రెండు రాజ్యాంగ పుస్తలకాను విడుదల చేశారు. ప్రతీయేటా నవంబర్​ 26ని రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకోవాలని 2015లో మోదీ ప్రభుత్వం నోటిఫికేషన్​ జారీ చేసింది. 
ఈ సందర్భంగా రాష్ట్రపతి ముర్మూ మాట్లాడుతూ..రాజ్యాంగం ప్రకారం వెనుకబడిన తరుగతుల సంక్షేమానికి ప్రస్తుత ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందన్నారు. నివాస గృహాలు, ఆహార భద్రత, మౌలిక సదుపాయాల కల్పన కల్పించడం అభినందనీయమన్నారు. రాజ్యాంగ పరిషత్‌ చైర్మన్‌ డాక్టర్‌ రాజేంద్రప్రసాద్‌, ముసాయిదా కమిటీ చైర్మన్‌ డాక్టర్‌ భీమ్‌రావ్‌ అంబేద్కర్‌లు రాజ్యాంగ రచనా యాత్రకు మార్గనిర్దేశం చేయడం దేశ అదృష్టమని రాష్ట్రపతి పేర్కొన్నారు. 
..................