స్కామ్​ ల్లో హస్తం నంబర్​ 1

Congress number 1 in scams

Nov 26, 2024 - 12:06
 0
స్కామ్​ ల్లో హస్తం నంబర్​ 1
నా తెలంగాణ, సెంట్రల్​ డెస్క్​: యూపీఏ తొమ్మిదేళ్ల పాలనలో అనేక కుంభకోణాలు వెలుగుచూశాయి. ఇవి దేశ ఆర్థిక వ్యవస్థకు తీవ్ర విఘాతం కలిగించాయి. దీంతో లక్షలాది కోట్ల సంపదను దేశం కోల్పోయింది. ఈ సంపదంతా హస్తం, ఆ పార్టీకి సహకరిస్తున్న నాయకుల జేబుల్లోకి వెళ్లాయి. విదేశాల్లో పెట్టుబడులుగా మళ్లాయి. కాంగ్రెస్​ హయాంలో జరిగిన కుంభకోణాల్లో మచ్చుకు కొన్ని..
 
బొగ్గు కుంభకోణం (2012): 194 బొగ్గు బ్లాకుల వేలంలో జరిగిన అవకతవకలపై కాగ్ నివేదిక రాజకీయ వర్గాల్లో తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ కుంభకోణం ద్వారా ప్రభుత్వ ఖజానాకు రూ. 1.86 లక్షల కోట్ల నష్టం వాటిల్లింది. 2004 నుంచి 2011 వరకు 194 బొగ్గు బ్లాకులను వేలం వేయకపోవడంతో దేశానికి సమకూరాల్సిన సంపదను కోల్పోయింది. తొలుత ఈ కుంభకోణం రూ. 10 లక్షల కోట్లుగా భావించినా కాగ్​ నివేదిక ద్వారా రూ. 1.86 లక్షల కోట్లని తేలింది. 
 
2జీ స్పెక్ట్రమ్ స్కామ్ (2008): 2008లో టెలికాం రంగంలో అనుభవం లేని అనేక దేశీయ కంపెనీలకు, 2001లో నిర్ణయించిన ధరతో దేశం 122 కొత్త టెలికాం లైసెన్స్‌లను జారీ చేసింది.ఈ కుంభకోణం వల్ల ప్రభుత్వానికి రూ. 1.76 లక్షల కోట్ల నష్టం వాటిల్లింది. 
 
ఛాపర్ స్కామ్(2012): ఇటలీ సంస్థ ఫిన్‌మెకానికా నుంచి వీవీఐపీఎస్‌ను తీసుకెళ్లేందుకు 12 హెలికాప్టర్‌లను కొనుగోలు చేసేందుకు రూ.3,600 కోట్ల డీల్‌ను కుదుర్చుకునేందుకు భారత వైమానిక దళ మాజీ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ ఎస్పీ త్యాగికి లంచం ఇచ్చినట్లు ఆరోపణలు వచ్చాయి.
 
టాట్రా ట్రక్ స్కామ్ (2012): సెప్టెంబరులో మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ వీకే సింగ్ తనకు రూ. 14 కోట్ల లంచం ఇచ్చారని ఆరోపించడంతో వెక్ట్రా చైర్మన్ రవి రిషితో పాటు మరికొన్ని సంస్థలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ 2013 ఏప్రిల్ మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద కేసు నమోదు చేసింది. 2010 ఆర్మీ కోసం 1,676 టాట్రా ట్రక్కుల కొనుగోలుకు సంబంధించినది ఈ కుంభకోణం. 
 
సీడబ్ల్యూజీ స్కామ్ (2010): సీడబ్ల్యూజీ అవినీతి కేసులో మోసం, కుట్రలు, ప్రభుత్వ ఖజానాకు రూ. 90 కోట్లకు పైగా నష్టం కలిగించినందుకు గాను కామన్వెల్త్ క్రీడల నిర్వహణ కమిటీ మాజీ ఛైర్మన్ సురేష్ కల్మాడీ, మరో తొమ్మిది మందిపై అభియోగాలు మోపారు.
 
ఆదర్శ్ కుంభకోణం (2012): బ్యూరోక్రాట్లు తమకు ఫ్లాట్లు పొందిన సొసైటీ కోసం రక్షణ శాఖకు చెందిన భూమిని రాష్ట్రం ఇచ్చిందని ఆరోపించిన నివేదికలతో ఆదర్శ్ వివాదం చెలరేగింది. రక్షణ ప్రాంతానికి అభిముఖంగా ఉన్న ఈ ఖరీదైన 31-అంతస్తుల కోలాబా భవనంలో రాజకీయ నాయకుల పాత్ర ఉన్నట్లు వెల్లడైంది.