భారత్​ పై ఉగ్రనీడ

నోట్ల రద్దుతో ఉగ్రనీడ బట్టబయలు

Oct 19, 2024 - 16:10
 0
భారత్​ పై ఉగ్రనీడ
శత్రుదేశాలకు వణుకు
ఆర్థికంలో చాణక్యనీతి
కరోనాతో శత్రుదేశాల విధానాలు బహిర్గతం
అంత్యర్యుద్ధానికి పీఎఫ్​ ఐ సిద్ధం
భారత్​ లో నక్కి ఉన్న పందికొక్కులెవ్వరూ?
దేశ విచ్ఛిన్నకర శక్తులెవరు?
మచ్చ రానీయమంటున్న మోదీ ప్రభుత్వం
నా తెలంగాణ, సెంట్రల్​ డెస్క్​: చుట్టూ ఉన్న మిత్రులుగా నటిస్తున్న శత్రుదేశాలను ఎదుర్కోవాలంటే ముందుగా మనదేశం ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేయాలి. అదే సమయంలో ఎదుటి దేశం ఆర్థిక వ్యవస్థ మనదేశ ఆర్థిక వ్యవస్థకంటే బలహీనమైనదని నిరూపించాలి. ఇది కత్తిమీద సామే అయినా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ బృహత్తర సాహసాన్ని చేశారు. తద్ఫలితంగా భారత్​ లో విచ్చలవిడిగా వస్తున్న నకిలీ కరెన్సీని అరికట్టగలిగారు. నోట్ల రద్దు చోటు చేసుకొని దాదాపు 8 యేళ్లు గడిచిపోయింది. ఇప్పుడు నోట్ల రద్దు గురించి చెప్పుకునే సందర్భం ఎందుకు వచ్చిందంటే.. దేశంలో ఉగ్రనీడ విస్తరిస్తోంది. రైల్వే, విమానాలు, సరిహద్దుల్లో ఉగ్రవాదం, పీఎఫ్​ ఐ, హిందువుల పర్వదినాల్లో రాళ్లదాడులు, బాంబుదాడులు, తుపాకులతో కాల్పులు, హిందూ దేవాలయాల్లో విధ్వంసాలు, విదేశాల్లో ఉండి భారత్​ పై విషం గక్కుతున్న ఉగ్రవాద ముఠాలు, వాటికి సహకరిస్తున్న భారత్​ లో నక్కి ఉన్న పందికొక్కులు (స్లీపర్​ సెల్స్​), వీటన్నింటికీ దేశ విచ్ఛిన్నకర శక్తుల మద్ధతు, మాల్దీవులు, బంగ్లా, పాక్​, కెనడా లాంటి దేశాల సహాయ సహకారాలతో భారత్​ ను పూర్తి విచ్ఛిన్నం చేయాలని ఉగ్రదేశాలు కంకణం కట్టుకున్నాయి. కానీ ఆ కంకణాలను విడగొట్టాలనే ఉద్దేశ్యంతో అహార్నిశలు ప్రధాని మోదీ (బీజేపీ) పనిచేస్తోందన్నది ప్రతీ హిందువు గుర్తించాల్సిన అంశం. పై దాడులు నిజం కాదో? లేదో? తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. 
 
నోట్ల రద్దు!
2014లో బీజేపీ అధికారంలోకి రాగానే విచ్ఛిన్నకర శక్తులకు నిద్దుర లేదు. దీంతో సరిహద్దు, ఇక్కడా, అక్కడా అనే తేడా లేకుండా ఈ ప్రభుత్వాన్ని కూలదోయాలని కంకణం కట్టుకున్నారు. మరోవైపు నిద్రాహారాలు మాని హిందూ దేశంలో ఈ పరిస్థితులకు కారణమెవ్వరనే దానిపై సుధీర్ఘ విచారణలకు మోదీ ప్రభుత్వం అంకురార్పణ చేసింది. ఈ అంకురార్పణ కూడా సుధీర్ఘంగానే జరిగింది. తద్ఫలితంగా 2016లో నోట్ల రద్దు లాంటి పెద్ద నిర్ణయాన్ని రాత్రికి రాత్రే ప్రకటించారు. దీంతో ఉగ్రమూలాలు, శత్రుదేశాలు, దేశ విచ్ఛిన్నకర శక్తుల నడ్డి విరిగింది. ఒక్క విధంగా చెప్పాలంటే భారత్​ తీసుకున్న ఈ నిర్ణయం ప్రపంచదేశాలనూ ఉలిక్కిపాటుగా గురి చేసింది. అప్పటివరకూ భారత్​ అంటే చిన్నచూపు చూసిన దేశాలన్నీ ఒక్కసారిగా భారత ఆర్థిక వ్యవస్థపై దృష్టి పెట్టసాగాయి. 
 
ఆర్థిక నిపుణుల చాణక్య నీతి..
ఇక ఇదే అదునుగా భారత్​ లోని ఆర్థిక నిపుణులను కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దింపింది. వీరంతా చాణక్య నీతిని అనుసరిస్తూ ఆర్థిక విధానాల పటిష్ఠతలో తోడ్పాటునందించారు. దీంతో దేశవ్యాప్తంగా ఓ అరవై రోజులపాటు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ ఆ తరువాత పరిస్థితులు శత్రుదేశాలు, విచ్ఛిన్నకర శక్తులు, ఉగ్రవాదులకు ఊహించని పరిణామంలా మారాయి. దీంతో కొత్త ఎత్తుగడలకు రూపకల్పననారంభించారు. ఈ విధానాలపై ఎప్పటికప్పుడు దృష్టి సారిస్తున్న మోదీ ప్రభుత్వం ఎప్పుడూ జెండా ఎగరని ప్రాంతంలో సైతం భారత జెండాను రెపరెపలాడించి తమ సత్తాను చాటింది ప్రపంచాన్ని దాసోహం చేసుకుంది. 
 
నమ్మకద్రోహానికి విశ్వాసం, నిజాయితీ దెబ్బ!
నమ్మకం, విశ్వాసం, నీతి, నిజాయితీ, నిబద్ధత, సహాయం అనే విషయాలే భారత్​ సూటి విధానాలని ప్రపంచానికి తేల్చి చెప్పింది. ఉగ్రవాదం, అస్థిరత, దాడులు, హింస, కుట్రలు, కుతంత్రాలు తమ విధానం కాదని స్పష్టం చేసింది. దీనికి తోడు కరోనా మహమ్మారి విజృంభించడం దానికి భారత్​ మరో శత్రుదేశంలో మూలాలు లభించడంతో అప్పటివరకూ పునీతులు, ఉన్నతులు ఈ దేశాలే (పాక్​, చైనా) అనుకుంటున్న ప్రపంచదేశ విధానాల్లో, ఆలోచనల్లో మార్పు చేర్పులు చోటు చేసుకున్నాయి. ఫలితం భారత్​ తో సత్సంబంధాలకు ఆయా దేశాలే గాక ప్రపంచపెద్దన్నగా పేర్కొనబడే అమెరికా కూడా అర్రులు చాచింది. ఇంకేముంది భారత్​ మోదీ నేతృత్వంలోని నిబద్ధతను చూపిస్తూ వెళ్లింది. ప్రస్తుతం ఐదో స్థానానికి చేరింది. దీన్ని అడ్డుకునేందుకు అనేక దేశ విచ్ఛిన్నకర శక్తులు ప్రయత్నించినా వారి ఎత్తుకు పై ఎత్తు వేస్తూ వారి చర్యలను ఎప్పటికప్పుడూ నిద్రాభంగం కలిగించింది. దీంతో ముచ్చటగా మూడోసారి కూడా మోదీ ప్రభుత్వం అధికారంలోకి రాగలిగింది. 
 
దేశ విచ్ఛిన్నకర శక్తులెవరు?
ఒక దేశ ఐక్యతను కూలదోయాలంటే, దేశాన్ని విచ్ఛిన్నం చేయాలంటే బయటి శక్తులే కానవసరం లేదు. దేశంలోని దుర్నీతి, దేశంలోని మంచి విధానాలను అంతర్జాతీయ సమాజంలో తప్పని చూపించే వారు ఉన్నా సరే ఆ దేశం విచ్ఛిన్నానికి కారణమవుతుంది. అదే సమయంలో భారత్​ లో అలాంటి శక్తుల పీచమణిచే మోదీ ప్రభుత్వం ఉన్నంత కాలం భారత్ పై మచ్చపడే అవకాశం లేదు. ఏది ఏమైనా మోదీ నిర్ణయం నోట్లరద్దు ఇప్పుడు ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే.. పీఎఫ్​ ఐ అనే ఉగ్ర సంస్థ 13వేల మంది క్రియాశీల సభ్యులు విదేశాల్లో దాక్కొని భారత్​ లో ఉన్న స్లీపర్​ సెల్స్​ కు నిధులు అందిస్తూ దేశ విచ్ఛిన్నానికి కారణభూతంగా నిలుస్తున్నారు. వీరెవ్వరనేది దర్యాప్తు సంస్థలు ఇప్పటికే ఓ కన్నేసి ఉంచినా, అలాంటి శక్తులు ఉపేక్షించకూడదనేది దేశ ప్రజల్లో ఉన్న మనోగతం.