బస్సు కాల్వలో పడి 14 మంది విద్యార్థులకు గాయాలు

14 students were injured when the bus fell into the canal

Oct 19, 2024 - 17:34
 0
బస్సు కాల్వలో పడి 14 మంది విద్యార్థులకు గాయాలు

చండీగఢ్​: హరియాణాలోని పంచకులలో పాఠశాల బస్సు కాల్వలో పడి 14 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. డ్రైవర్​ కు తీవ్ర గాయాలయ్యాయి. శనివారం మలేర్​ కోట్లలోని నంకనా సాహిబ్​ పాఠశాల విద్యార్థులను పంజాబ్​ నుంచి మోర్నీ హిల్స్​ ను సందర్శించేందుకు విహార యాత్రకు తీసుకువెళుతున్నారు. తిక్కర్​ తాల్​ రోడ్డు థాల్​ గ్రామం సమీపంలోకి రాగానే బస్సు వేగం వల్ల బస్సు అదుపు తప్పి కాలువలో బోల్తా పడింది. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న విద్యార్థులతోపాటు ఒక ఉపాధ్యాయుడు, డ్రైవర్​ కు గాయాలయ్యాయి. విద్యార్థులను థాల్​ గ్రామంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించగా, డ్రైవర్​ రెండు కాళ్లు విరిగిపోవడంతో వేరే ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బస్సులో 45 మంది ప్రయాణిస్తున్నారు.