ఝార్ఖండ్​ లో 70 స్థానాల్లో జేఎంఎం, కాంగ్రెస్​ పోటీ

11 స్థానాల్లో లెఫ్ట్​, ఆర్జేడీల పోటీ?

Oct 19, 2024 - 15:22
 0
ఝార్ఖండ్​ లో 70 స్థానాల్లో జేఎంఎం, కాంగ్రెస్​ పోటీ

రాంచీ: ఝార్ఖండ్​ లోని జేఎంఎం, కాంగ్రెస్​ సీట్లు ఖరారయ్యాయి. 81 స్థానాలకు గాను 70 స్థానాల్లో కాంగ్రెస్​, జేఎంఎంలు కలిసి పోటీ చేస్తాయని, మిగిలిన 11 సీట్లలో కూటమి లెఫ్ట్​ ఫ్​రంట్​, ఆర్జేడీలు పంచుకుంటాయని తెలిపారు. శనివారం సీఎం హేమంత్​ సోరెన్​, కాంగ్రెస్​ ఝార్ఖండ్​ ఎన్నికల ఇన్​ చార్జీ గులాం అహ్మద్​ మీర్​ సంయుక్తంగా విలేఖరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సీట్ల విషయాన్ని వెల్లడించారు. అయితే ఇరు పార్టీలు పోటీ చేస్తున్న స్థానాలు ఏవనే విషయం వెల్లడించలేదు. త్వరలో స్థానాలను వెల్లడిస్తామన్నారు. అదే సమయంలో మిగతా 11 స్థానాల్లో ఆర్జేడీ ఎన్నిసీట్లు ఏయే స్థానాల్లో పోటీ చేస్తుంది? లెఫ్ట్​ పార్టీలకు ఏ సీట్లు, ఏయే స్థానాల్లో పోటీ చేస్తాయన్న విషయాన్ని వెల్లడించలేదు.