దేవాలయాలు, హిందువులకు భద్రత కల్పించాలి

బంగ్లాలో దాడులు ఆపకుంటే పెద్ద యెత్తున నిరసనకు దిగుతాం బంగ్లాదేశ్​ ప్రభుత్వానికి సున్నీ సంస్థల హెచ్చరిక

Dec 7, 2024 - 17:43
 0
దేవాలయాలు, హిందువులకు భద్రత కల్పించాలి

ముంబాయి: బంగ్లాదేశ్​ లో హిందువుల, దేవాలయాలకు భద్రత కల్పించాలని వెంటనే వారిపై జరుగుతున్న దాడులను ఆపాలాని ఆల్​ ఇండియా సున్నీ జమయల్​ ఉలమా, రజా అకాడమ, జమియల్​ ఉలమా ఎ అహ్లే సున్నత్​ ఆ దేశ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. బంగ్లాదేశ్​ లో భారతీయులపై జరుగుతున్న దాడులపై శనివారం ముంబాయిలోని హండివాలీ మసీదులో సమావేశమైంది. సమావేశానికి రజా అకాడమీ వ్యవస్థాపకుడు, అధినేత హాజీ సయిద్​ నూరి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏ దేశంలోనైనా దౌర్జన్యాలు, దాడులు విచారకరం, ఖండించదగినవన్నారు. ముస్లిం మెజార్టీ దేశంలో ఈ దాడులు సరికాదన్నారు. ఇది ఇస్లాం మతం, బోధనలకు  వ్యతిరేకమన్నారు. అలా దాడులను బంగ్లాదేశ్​ ప్రభుత్వం అడ్డుకోని పక్షంలో భారత్​ లోని ఉలేమా ఎ సున్నత్​ వీధుల్లోకి వస్తుందని హెచ్చరించారు. వెంటనే తాత్కాలిక ప్రభుత్వాధినేత యూనస్​ కల్పించుకొని హిందువులకు, దేవాలయాలకు రక్షణ కల్పించాలని డిమాండ్​ చేశారు. లేని పక్షంలో భారత్​ వ్యాప్తంగా బంగ్లాదేశ్​ పై నిరసనలు తెలియజేస్తామి హాజీ నూరి హెచ్చరించారు. 

దాడులతో బంగ్లా ప్రతిష్ఠ మసకబారుతుందని షేర్​ మిల్లత మౌలానా ఇజాజ్​ అహ్మద్​ కాశ్మీరీ అన్నారు. దాడులకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు. దాడులు ఆపకుంటే ఢిల్లీలోని బంగ్లాదేశ్​ ఎంబసీని ముట్టడిస్తామని​ చేస్తామని హెచ్చరించారు. భారత్​ లోని ముస్లింలందరూ బంగ్లాలోని మైనార్టీలకు అండగా నిలబడతారని మౌలానా ఖీలూర్​ రెహ్మాన్​ నూరి స్పష్టం చేశారు.