మహా అసెంబ్లీలో 173మంది ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం
ప్రతిపక్ష ఎమ్మెల్యేల వాకౌట్
ముంబాయి: మహారాష్ట్ర అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల సందర్భంగా 173 మంది ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. శనివారం ప్రత్యేక సమావేశాలను నిర్వహించారు.288మంది ఎమ్మెల్యేలకు గాను 173మంది ఎమ్మెల్యేలు మాత్రమే ప్రమాణ స్వీకారం చేయగా మిగతా ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయలేదు. విపక్ష పార్టీలు వాకౌట్ చేశాయి. ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం అనంతరం అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు వాయిదా పడ్డాయి. వాకౌట్ పై డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మాట్లాడుతూ.. ఎన్నికలు జరిగాయి, ప్రజలు మమ్మల్ని గెలిపించారు. ప్రస్తుతం వాకౌట్‌తో ఒరిగేదేం లేదన్నారు. ప్రతిపక్షాలు ఎన్నికల కమిషన్లు, ఈవీఎంల విషయంపై కోర్టుకు వెళ్లవచ్చన్నారు.