మోదీ ధ్యానం

Modi meditation

May 31, 2024 - 18:43
May 31, 2024 - 18:44
 0
మోదీ ధ్యానం

కన్యాకుమారి: ప్రధాని నరేంద్ర మోదీ రెండో రోజు శుక్రవారం ధ్యానంలో గడిపారు. ధ్యానంలో ఉన్నప్పుడు ఆయన మౌనంగానే ఉండనున్నారు. తమిళనాడులోని భగవతి అమ్మన్ ఆలయానికి చేరుకొని పూజలు నిర్వహించారు. అనంతరం ఓ పడవలో బయలుదేరి సముద్రం మధ్యలో ఉన్న శిలాస్మారకాన్ని చేరుకొని రామకృష్ణ పరమహంస, మాతా శారదాదేవి చిత్రపటాలకు పూలమాలలు వేశారు. వివేకానందుడి విగ్రహం వద్ద పుష్పాంజలి ఘటించాక గురువారం ధ్యానంలో మునిగిపోయారు.

రెండోరోజు ఉదయాన్నే కాషాయ వస్ర్తాలు ధరించి సూర్యనమస్కారం చేశారు. అనంతరం వివేకానంద స్మారక ప్రాంగణంలో ప్రదక్షిణలు చేశారు. ధ్యానం చేస్తున్న రోజుల్లో ప్రధాని మోదీ కేవలం ద్రవ పదార్థాలైన కొబ్బరి నీరు, ద్రాక్షరసాలను మాత్రమే ఆహారంగా స్వీకరిస్తారు. మోదీ ధ్యానం మూడురోజులపాటు 45 గంటలు కొనసాగనుంది. కాగా మోదీ ధ్యానంలో ధరించిన దుస్తులు ఆయన మోము బహు తేజస్సుతో కనిపిస్తున్న చిత్రాలు కనువిందు చేస్తున్నాయి.