నిర్మలమ్మ పద్దులూ రికార్డే!
Nirmalamma Paddu too record!
నా తెలంగాణ,న్యూ ఢిల్లీ: వరుసగా ఆరోసారి పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టబోతున్న మహిళా ఆర్థిక శాఖ మంత్రిగా నిర్మలా సీతారామన్ రికార్డుల్లోకెక్కనున్నారు. జూలై 23న పార్లమెంట్ లో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనుండడంతో నిర్మలమ్మ పద్దుల రికార్డును సాధించనున్నారు. ఇప్పటివరకూ మంత్రి ఐదుసార్లు పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టగా, మధ్యంతర బడ్జెట్ ను ఒకసారి ప్రవేశపెట్టారు. మంగళవారం పూర్తిస్థాయి బడ్జెట్ ను మంత్రి ప్రవేశపెట్టనున్నారు. ఇంతకుముందు మొరార్జీ దేశాయ్, అరుణ్ జైట్లీ, పి. చిదంబరం, యశ్వంత్ సిన్హా, మన్మోహన్ సింగ్ లను అధిగమించనున్నారు. ఇదే గాక పార్లమెంట్ పై బడ్జెట్ పై అత్యధిక సమయం ప్రసంగించిన మంత్రిగా కూడా నిర్మలా సీతారామన్ రికార్డు సాధించనున్నారు.
ఇంతకుముందు మొరార్జీ దేశాయ్ పదిసార్లు, పి. చిదంబరం–9, ప్రణబ్ ముఖర్జీ– 8, సీడీ దేశ్‌ముఖ్–7, యశ్వంత్ సిన్హా–7, మన్మోహన్ సింగ్–6 సార్లు బడ్జెట్ ను ప్రవేశపెట్టారు.