శివాజీ విగ్రహం కూలిన ఘటనలో.. శిల్పి అరెస్ట్
Sculptor arrested in Shivaji statue collapse incident
ముంబాయి: గత నెలలో శివాజీ విగ్రహం కూలిన ఘటనలో శిల్పి జయదీప్ ఆప్టేను పోలీసులు గురువారం అరెస్టు చేశారు. విగ్రహం నాణ్యత, పటిష్ఠతపై అనుమానాలు లేవనెత్తుతుండడంతో జయదీప్ కోసం గత వారం రోజులుగా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. విగ్రహం కూలాక జయదీప్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో పోలీసులు లుకౌట్ నోటీసు కూడా జారీ చేశారు. జయదీప్ ను కళ్యాణ్ నివాసం నుంచి అరెస్టు చేసినట్లుగా పోలీసులు తెలిపారు.