ఆరు డిమాండ్లపై చర్చకు విపక్షాల పట్టు
అభ్యర్థను తిరస్కరించిన స్పీకర్
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: పార్లమెంట్ ప్రారంభమైన తొలిరోజు కాంగ్రెస్ మిత్రపక్షాలు పలు అంశాలపై చర్చ జరగాలని తీర్మానించాయి. ఉభయ సభల్లో చర్చ జరగాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. దీంతో పార్లమెంట్, రాజ్యసభ సమావేశాలు ఒక గంటపాటు వాయిదా పడ్డాయి. తిరిగి 12 గంటలకు సమావేశాలు ప్రారంభమైనా అవే అంశాలపై ముందుగా చర్చ జరగాలని కాంగ్రెస్, మిత్రపక్షాలు పట్టుబట్టాయి. నిరసనలు చేపట్టడంతో పార్లమెంట్ ఉభయ సభలు బుధవారానికి వాయిదా పడ్డాయి.
ప్రతిపక్షాలు అదానీ లంచం ఆరోపణలపై చర్చ జరగాలని డిమాండ్ చేశాయి. సంభాల్ మసీదు వివాదంలో హింసపై కూడా చర్చ జరగాలని పట్టుబట్టాయి. మనిపూర్ హింస, ఢిల్లీ కాలుష్యం, రైలు ప్రమాదాలు, వక్ఫ్ బిల్లు, వన్ నేషన్ వన్ఎలక్షన్ లపై చర్చ జరగాలని నిరసన చేపట్టాయి. కాంగ్రెస్ మిత్రపక్షాల తీర్మానాలను స్పీకర్ జగదీప్ ధన్కర్ తిరస్కరించారు. చర్చ అభ్యర్థనను తోసిపుచ్చారు.