చొరబాట్లపై చింత వద్దు

కేంద్రం పకడ్భందీ చర్యలు పశ్చిమ బెంగాల్​ గవర్నర్​ సీవీ ఆనంద్​ బోస్​

Aug 6, 2024 - 15:51
 0
చొరబాట్లపై చింత వద్దు

కోల్​ కతా: పశ్చిమ బెంగాల్​ లోని సరిహద్దులపై చొరబాట్ల గురించి చింతింతవద్దని ఆ రాష్ర్ట గవర్నర్​ సీవీ ఆనంద్​ బోస్​ అన్నారు. సరిహద్దులు సురక్షితంగా ఉన్నాయని, కేంద్రం పకడ్భందీ చర్యలు తీసుకుందన్నారు. మంగళవారం గవర్నర్​ సీవీ బోస్​ మీడియాకు ప్రకటన విడుదల చేశారు. రాజకీయ సంక్షోంభంపై ప్రజలు భయాందోళనలకు గురి కావొద్దన్నారు. భారత్​ లోకి అనధికారిక ప్రవేశాన్ని పూర్తిగా నిరోధించేందుకు సమర్థవంతమైన చర్యలు తీసుకున్నామన్నారు. పుకార్లు పుట్టించే వారి మాటలను నమ్మవద్దని గవర్నర్​ విజ్ఞప్తి చేశారు. 

కాగా భారత్​–బంగ్లాదేశ్​ ల మధ్య 4096.7 కిలోమీటర్ల సరిహద్దు ప్రాంతముంది. ఇందులో అత్యధికంగా పశ్చిమ బెంగాల్​ లోనే 2217 కిలోమీటర్ల సరిహద్దు ప్రాంతం ఉంది. అసోం 263 కి.మీ, త్రిపుర 856 కి.మీ, మేఘాలయ 443, మిజోరామ్​ 318 కిలోమీటర్ల సరిహద్దును కలిగి ఉన్నాయి.