మెడికో అత్యాచారం, హత్య కుటుంబంతో గంగూలీ నిరసన
Ganguly protests with family of medico rape and murder
నేరానికి క్షమాపణ లేదు.. వ్యవస్థనూ నిందించలేం
అనుకూలమా? వ్యతిరేకమా?
రాష్ర్ట ప్రభుత్వాన్ని కాపాడే ప్రయత్నమా?
నిరసన ప్రకటనపై అనుమానాలు!
కోల్ కతా: కోల్ కతా మెడికో హత్య కేసుపై ప్రముఖ క్రికెటర్ సౌరవ్ గంగూలీ తన భార్యతో కలిసి నిరసన వ్యక్తం చేయనున్నారు. బుధవారం ఆయన బాధితురాలి అత్యాచారం, హత్యపై న్యాయం చేయాలని డిమాం చేయాలని ఆందోళన చేపట్టనున్నారు.
అత్యాచార, హత్య ఘటనపై మంగళవారం బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పందించారు. బుధవారం తన నిరసన వ్యక్తం చేయనున్నట్లు తెలిపారు.
గంగూలీ క్రికెటర్ అయి కాస్త డబ్బు సంపాదించుకున్నాక సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందువరుసలో నిలుస్తున్నారు. తన భార్య డోనా గంగూలీతో కలిసి వందలాది మంది అమ్మాయిలకు ఒడియా డ్యాన్స్ నేర్పే పాఠశాలను నెలకొల్పారు.
నేరానికి క్షమాపణ చెప్పలేమన్నారు. అదే సమయంలో నేరానికి పూర్తి వ్యవస్థను బాధ్యులను చేయడం సరికాదన్నారు. వైద్య సంస్థల్లో భద్రతా చర్యలు తీసుకోవాలని గంగూలీ పేర్కొన్నారు.
అయితే గంగూలీ నిరసన మెడికో విద్యార్థి అత్యాచారం, హత్య గురించా? లేదా కోల్ కతా ప్రభుత్వానికి అనుకూలంగానా? లేదా కేంద్ర ప్రభుత్వానికి మద్ధతా, లేదా ఆడపిల్లలకూ భద్రత కల్పించడంపైనా అనేది పూర్తి అస్పష్టంగా ఉండడంతో పలు అనుమానాలు కూడా వ్యక్తం అవుతుండడం విశేషం.