పెట్టుబడులకు స్వర్గధామం

A haven for investments

Sep 5, 2024 - 18:06
 0
పెట్టుబడులకు స్వర్గధామం
నాలుగు ఎంఓయూలపై సంతకాలు
సెమీ కండక్టర్​ యూనిట్​ సందర్శన
పలు రంగాల్లో కలిసి నడుద్దామని నిర్ణయం
50 శాతం రియల్​ టైమ్​ లావాదేవీలు భారత్​ లోనే 
ప్రధానికి సీనియర్​ మంత్రి లీ ప్రత్యేక విందు
అధ్యక్షుడు దర్శన్​ షణ్ముగం, ప్రధాని లారెన్స్​ వాంగ్​ లతో మోదీ భేటీలో కీలక నిర్ణయాలు
సింగపూర్​ సిటీ: స్కిల్​ డెవలప్​ మెంట్​ కోసం భారత్​ కు రావాలని, కాశీలో పెట్టుబడులు పెట్టాలని భారత్​ పెట్టుబడులకు స్వర్గధామమని సింగపూర్​ వ్యాపారవేత్తలకు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. సింగపూర్​ పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, సింగపూర్​ ప్రధాని, రాష్​ర్టపతిలతో భేటీ నిర్వహించి ద్వైపాక్షిక అంశాలపై విస్తృతంగా చర్చించారు. సింగపూర్​ పార్లమెంట్​ హౌస్​ లో ప్రధాని లారెన్స్​ వాంగ్​, విదేశాంగ మంత్రి వివియన్​ బాలకృష్ణన్​ సమక్షంలో పలు పలు ఒప్పందాలపై గురువారం ఎంఓయూలపై సంతకాలు చేశారు. 
 
యాక్ట్ ఈస్ట్​ పాలసీలో భాగంగా డిజిటల్​ టెక్నాలజీ, సెమీ కండక్టర్​, ఆరోగ్యం, విద్యపై సహకారం, నైపుణ్యాభివృద్ధి ఒప్పందాల (ఎంఓయూ)పై ఇరుదేశాల విదేశాంగ శాఖ మంత్రులు సంతకాలు చేశారు. 
 
కలిసి నడుద్దాం..
మోదీ పర్యటనలో భాగంగా ఉదయం సెమీ కండక్టర్​ యూనిట్​ ను సందర్శించారు. యూనిట్​ నిర్వహణ తీరుపై పలు వివరాలను అడిగి తెలుసుకున్నారు. సెమీకండక్టర్ క్లస్టర్ డెవలప్‌మెంట్, టాలెంట్ కల్టివేషన్‌లో సహకారాన్ని సులభతరం చేస్తూ భారతదేశం-సింగపూర్ సెమీకండక్టర్ ఎకోసిస్టమ్ కోసం రెండో ఎంఓయూ ద్వారా భాగస్వామ్యాన్ని కొనసాగిస్తుంది. గ్లోబల్ సెమీకండక్టర్ వాల్యూ చైన్‌లో అంతర్భాగమైన సింగపూర్ కంపెనీలు భారతదేశంలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తితో ఉన్నాయి. ఈ ఒప్పందం ద్వారా భారత్​ లో సింగపూర్​ సంస్థల సెమీ కండక్టర్​ పరిశ్రమలు పెద్ద యెత్తున నెలకొల్పే అవకాశం ఉంది. దీంతో దేశంలో పెట్టుబడుల రాకతోపాటు ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడనున్నాయి. 
 
అదే సమయంలో ఆరోగ్యం, ఔషధం, ఉమ్మడి పరిశోధన, ఆవిష్కరణ, మానవ వనరుల అభివృద్ధి సహకారంపై దృష్టి సారించనున్నాయి. ఇరుదేశాల్లోని నైపుణ్య అభివృద్ధి, పరిశోధన, పరిష్కార మార్గాలను కలిసి వెతకనున్నాయి. సాంకేతికత, విద్యలో సహకారం పెంపొందించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నాయి. 
 
వ్యాపారవేత్తలతో ప్రధాని మోదీ..
భారత్​ లో విస్తృత అవకాశాలున్నాయని పెట్టుబడులతో రావాలని మోదీ వ్యాపారులకు పిలుపునిచ్చారు. భారత్​ అవసరాలు, ప్రపంచ మార్కెట్​ తో, ఉపాధి, నైపుణ్యాభివృద్ధితో ముడిపడి ఉన్నాయని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్​ సర్వే డిమాండ్​ ను బట్టి నిర్ణయం తీసుకోవాలన్నారు. గ్లోబల్​ మార్కెట్​ లో భారత్​–సింగపూర్​ మార్కెట్లు మరింత బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకుందామని పిలుపునిచ్చారు. గ్లోబల్​ వార్మింగ్​ ప్రపంచానికి ఒక సవాల్​ గా నిలుస్తున్న ఈ సమయంలో ఆ సమస్యకు ఇరుదేశాలు కలిసి పరిష్కార మార్గం కనుగొందామని మోదీ పునరుద్ఘాటించారు.  విద్యుత్​ ఉత్పాదనలో 500 గిగావాట్ల ఉత్పాదన సామర్థ్యాన్ని నిర్దేశించుకున్నామని, 2030 నాటికి దీన్ని పూర్తి చేయాలనే ధృడ నిశ్చయంతో ఉన్నట్లు తెలిపారు. పర్యావరణ హిత కార్యక్రమాలకు ఇరుదేశాలు అంకురార్పణ చేద్దామన్నారు. అదే సమయంలో గ్రీన్​ జాబ్స్​ ఉపాధి అవకాశాలను మెరుగుపరుద్దామని ప్రధాని మోదీ వివరించారు. ప్రస్తుతం రియల్​ టైమ్​ లావాదేవీలు ప్రపంచంలో 50 శాతం కేవలం భారత్​ లోనే జరుగుతున్నాయని తెలిపారు. ఫిన్​ టెక్​ ప్రపంచంలో ఎదగాలనుకుంటే భారత్​ కేంద్ర బిందువని సింగపూర్​ వ్యాపారులకు వివరించారు. 
 
గురువారం మధ్యాహ్నం సింగపూర్ సీనియర్ మంత్రి లీ హెసీన్ లూంగ్ తో కలిసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయన ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విందులో పాల్గొన్నారు. 
 
సింగపూర్ అధ్యక్షుడు ధర్మన్ షణ్ముగరత్నంతో ప్రధాని మోదీ భేటీ అయి భారత్​ – సింగపూర్​ భాగస్వామ్యంలో కీలక భూమిక వహించినందుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఇరువురు రెండు దేశాల మైత్రి బంధంపై కొద్దిసమయం చర్చలు జరిపారు. అనంతరం విజిటర్స్​ బుక్​ లో సంతకాలు చేశారు.