అభ్యంతరకర వ్యాఖ్యలపై షైనా ఎన్ సీ ఫిర్యాదు
మోదీ నేతృత్వంలో మహిళలకు గౌరవం
మహా వినాశ్ అఘాడీలో దృష్టిలో మహిళలు ఆటబొమ్మలా?
క్షమాపణలు చెప్పకుంటే తీవ్ర పరిణామాలు
ముంబాయి: తనపై అరవింద్ సావంత్ చేసిన వ్యాఖ్యలు ఆయన మానసిక రుగ్మతకు కారణమని వెంటనే ఆయన, కాంగ్రెస్ నాయకుడు అమిన్ పటేల్ లు క్షమాపణలు చెప్పాలని శివసేన (ఏక్ నాథ్ షిండే) వర్గం ముంబాదేవి స్థానం నుంచి పోటీలో ఉన్న అభ్యర్థి షైనా ఎన్ సీ డిమాండ్ చేశారు. శుక్రవారం ఆమె నాగ్ పడా పోలీస్ స్టేషన్ కు చేరుకొని ఫిర్యాదు చేశారు. శివసేన (యూబిటీ) వర్గం నాయకుడు అరవింద్ సావంత్ తనను ఇంపార్టెంట్ గూడ్స్ అనడం పట్ల తీవ్ర అసహనం, ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు అనంతరం ఆమె బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు. సావంత్ వ్యాఖ్యలు చేస్తుంటే కాంగ్రెస్ నాయకుడు అమిన్ పటేల్ అక్కడ ఉండి నవ్వుతున్నారని ఆరోపించారు.
ఓ వైపు ప్రధాని మోదీ, సీఎం ఏక్ నాథ్ షిండేలు మహిళల ఆర్థిక ఉన్నతికి, ప్రగతికి, వారి గౌరవ మర్యాదలు పెరిగేలా నిర్ణయాలు తీసుకుంటుంటే మరోవైపు ‘మహా వినాశ్ అఘాడీ’ (మహా వికాస్ అఘాడీ) సావంత్ తనపై చేసిన వ్యాఖ్యలు ఆయన అవివేకానికి, మానసికత రుగ్మతకు కారణాలుగా కనిపిస్తున్నాయన్నారు. ఏది ఏమైనా ఆయన భేషరతుగా మహిళా లోకానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. తాను ఒక స్ర్తీని అని ఆస్తిని కాదని తనను అవమానిస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇండి కూటమి మహిళల సాధికారతకు వ్యతిరేకమే..
అరవింద్ వ్యాఖ్యల పట్ల బీజేపీ అధికార ప్రతినిధి షహజాద్ పూణేవాలా మాట్లాడుతూ.. కాంగ్రెస్ కూటమి మహిళల పట్ల వ్యవహరించే తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మహిళల అవమానమే వీరి పరిచయమని విమర్శించారు. గతంలో సీతా సోరెన్, అధ్యక్షురాలు రాష్ర్టపతిపై కూడా అసభ్య వ్యాఖ్యలు చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. అత్యాచారాలు చేసిన వారికి ప్రియాంక వాద్రా పిలిచి మరీ అభ్యర్థులుగా టిక్కెట్లు కేటాయించారని గుర్తు చేశారు. దేశంలో ఈ కూటమి పార్టీలు మహిళల పట్ల వ్యవహరిస్తున్న తీరును ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. బెంగాల్, కేరళ, హరియాణా తదితర ప్రాంతాల్లో మహిళలపై జరిగిన లైంగిక దాడులు, హత్యల్లో నిందితులైన వారిని ఈ పార్టీలు కాపాడుతున్నాయని ఆరోపించారు. ఈ పూర్తి ఇండి అలయన్స్ కూటమి లక్ష్యమే మహిళల పట్ల అవమానకరంగా ఉందని పూణేవాలా ఆగ్రహం వ్యక్తం చేశారు.