మహా పోటీలో 7994 అభ్యర్థులు

7994 candidates in the grand competition

Nov 1, 2024 - 17:58
 0
మహా పోటీలో 7994 అభ్యర్థులు

921 నామినేషన్లు చెల్లినవి
యువ ఓటర్లు 22,22,74
వందేళ్లు పైబడిన ఓటర్ల సంఖ్య 47,392
ఉపసంహరణకు నవంబర్ 4 చివరి గడువు
ప్రకటించిన మహారాష్ట్ర ఈసీ

ముంబాయి: మహారాష్ట్ర ఎన్నికల్లో 288 స్థానాలకు గాను 7994 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 921 మంది అభ్యర్థుల నామినేషన్లు చెల్లనివిగా ఈసీ అధికారులు గురువారం ప్రకటించారు. రాష్ర్ట వ్యాప్తంగా 9,70,25,119 మంది ఓటర్లు ఉండగా, 5,00,22,739 మంది పురుషులు, 4,69,96,279 మంది మహిళలు, 6,101 మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నారు. 18 నుంచి 19 యేళ్ల వయస్సు వారు 22,22,7‌‌4 మంది యువ ఓటర్లున్నారు. వంద సంవత్సరాలకు పైబడిన వారు 47,392మంది ఓటర్లున్నారు. అత్యంత వృద్ధ ఓటరు వయస్సు 109 ఏళ్లుగా ఈసీ ప్రకటించింది. కాగా నామినేషన్ల ఉపసంహరణ నవంబర్​ 4 వరకు గడువు ఉంది. అటు పిమ్మట పోటీ అభ్యర్థుల సంఖ్య మరింత తగ్గే అవకాశం ఉంది. నవంబర్ 20న ఎన్నికలు జరగనుండగా 23న ఫలితాలు వెల్లడికానున్నాయి. మహాయుతి, మహావికాస్​ అఘాడీ కూటమిపార్టీల మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. విజయం కోసం ఇరు కూటములు హోరాహోరీ ప్రచారంతో రాజకీయ వేడిని మరింత పెంచుతున్నాయి.