రాహుల్​ హామీల కార్డు అమలేది?

మహారాష్​ర్ట డిప్యూటీ సీఎం ఫడ్నవీస్​

Nov 1, 2024 - 17:11
 0
రాహుల్​ హామీల కార్డు అమలేది?

ముంబాయి: కాంగ్రెస్​ పాలిత ప్రాంతాల్లో రాహుల్​ గాంధీ హామీల అమలు కార్డు ఎందుకు అమలు కావడం లేదని మహారాష్ర్ట ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్​ నిలదీశారు. దీపావళి సందర్భంగా జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొని కాంగ్రెస్​ పార్టీపై విమర్శల బాణాలు ఎక్కుపెట్టారు. తెలంగాణ, హిమాచల్​ ప్రదేశ్​, కర్ణాటక లలో ఈ ప్రయోగం విఫలమైందన్నారు. ముందుగా హామీల కార్డు విడుదల చేసి గెలిచాక ముఖం చాటేసుకుంటారని విమర్శించారు. రాజస్థాన్​, చత్తీస్​ గఢ్​ లలో ప్రజలు రాహుల్​ హామీని నమ్మలేదన్నారు. మహారాష్​ర్టలో మహాయుతికి వ్యతిరేకంగా నామినేషన్లు వేయిస్తూ కుట్ర రాజకీయాలకు తెరతీశారని ఆరోపించారు. తాము అన్ని ప్రజా సమస్యలను పరిష్కరించామని అన్నారు. నవంబర్​ 4 నాటికి తిరుగుబాటుదారులంతా తమ నామినేషన్లను ఉపసంహరించుకునేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ నెల 20న జరగనున్న ఎన్నికల్లో మరోమారు మహాయుతి కూటమి అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.