ఝార్ఖండ్ లో గెలుపు దిశగా జెఎంఎం కూటమి
JMM alliance towards victory in Jharkhand
రాంచీ: ఝార్ఖండ్ లో గెలుపు దిశగా జెఎంఎం (ఝార్ఖండ్ ముక్తి మోర్చా) కూటమి 51 స్థానాలతో దూసుకుపోతుంది. శనివారం జరుగుతున్న ఎన్నికల కౌంటింగ్ లో జెఎంఎం కూటమి 51 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా, బీజేపీ కూటమి 29 స్థానాల్లో ముందంజలో ఉంది. 81 అసెంబ్లీ స్థానాలకు గానూ మ్యాజిక్ ఫిగర్ 41. దీంతో ఝార్ఖండ్ లో జెంఎంఎం కూటమి ఖాయం దిశగా వెళుతోంది.