భూ సేకరణ రాష్ట్ర ప్రభుత్వానిదే బాధ్యత
Land acquisition is the responsibility of the state government
- యూపీఏ హయాంలో రూ. 879 కోట్లు
- ప్రస్తుతం రూ. 6,362 కోట్లను కేటాయించాం
- నత్తనడకన భూసేకరణ ప్రక్రియపై ఆగ్రహం
- తమిళనాడు స్టాలిన్ ప్రభుత్వం నిర్లక్ష్యం
- రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్
చెన్నై: తమిళనాడులో రైల్వే ప్రాజెక్టు భూ సేకరణ ప్రక్రియను వేగవంతం చేసి రైల్వే శాఖకు అందించాల్సిన బాధ్యత రాష్ర్ట ప్రభుత్వానికి ఉందని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ అన్నారు. తమిళనాడు రైల్వే అభివృద్ధి కోసం ఎన్‌డిఎ ప్రభుత్వం రూ. 6,362 కోట్లను కేటాయించిందన్నారు.
కీలకమైన ప్రాజెక్టుపై మంగళవారం కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ ఆరా తీశారు. భూసేకరణ నత్తనడకన సాగడం పట్ల సీఎం స్టాలిన్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
2024–25కు సంబంధించి రైల్వే కేటాయింపుల్లో తమిళనాడు రైల్వేకు అత్యధిక ప్రాధాన్యతనిస్తే రాష్ర్ట ప్రభుత్వం మాత్రం నత్తనడకన చర్యలు చేపట్టడం ఎంతమేర సమంజసమని ప్రశ్నించారు. యూపీఏ హయాంలో రూ. 879 కోట్లుగా ఉన్న వార్షిక కేటాయింపు కంటే ప్రస్తుతం రూ.రూ. 6,362 కోట్లు (ఏడు రెట్లు ఎక్కువ) ఉందన్నారు. తమిళనాడు రైల్వే అభివృద్ధి దేశంతో కనెక్టివిటీ మరింత మెరుగుగా తీర్చిదిద్దేందుకు కేటాయిస్తూ కేంద్రం నిబద్ధతను చాటుకున్నామని మంత్రి తెలిపారు.
రైల్వే ప్రాజెక్టుకు సంబంధించి 2,749 హెక్టార్ల భూమి సేకరణకు ఇప్పటివరకు కేవలం 807 హెక్టార్లు మాత్రమే సేకరించడం ఏంటని ప్రశ్నించారు. దీంతో తమిళనాడు అభివృద్ధికి ఇది విఘాతం కలగజేస్తుందన్నారు.