బీజేపీలోకి సావిత్రి జిందాల్​ కాంగ్రెస్​ కు గుడ్​ బై

దేశంలోనే అత్యంత ధనవంతురాలైన సావిత్రి జిందాల్​ కాంగ్రెస్​ కు గుడ్​ బై చెప్పి బీజేపీలో చేరారు.

Mar 28, 2024 - 20:35
 0
బీజేపీలోకి సావిత్రి జిందాల్​ కాంగ్రెస్​ కు గుడ్​ బై

చండీగఢ్​: దేశంలోనే అత్యంత ధనవంతురాలైన సావిత్రి జిందాల్​ కాంగ్రెస్​ కు గుడ్​ బై చెప్పి బీజేపీలో చేరారు. ఈ విషయాన్ని సావిత్రి జిందాల్​ బుధవారం అర్థరాత్రి సామాజిక మాధ్యమం ద్వారా తెలిపారు. గురువారం బీజేపీలో చేరారు. హిస్సార్​ కు పదేళ్లు ప్రాతినిధ్యం వహించానని, హరియాణాకు మంత్రిగా కూడా పనిచేశానని ప్రజలను తనపై, తన కుటుంబంపై చూపుతున్న అభిమానం, ఆప్యాయతలకు సదా రుణపడి ఉంటానని స్పష్టం చేశారు. కుటుంబ సభ్యుల సలహా మేరకు కాంగ్రెస్​ ను వీడి బీజేపీలో చేరుతున్నట్లు వివరించారు. కొద్ది రోజుల క్రితం సావిత్రి కుమారుడు మాజీ ఎంపీ నవీన్ జిందాల్ కూడా కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరారు. ప్రముఖ పారిశ్రామికవేత్త, హర్యానా మాజీ మంత్రి ఓపీ జిందాల్ కుమారుడు నవీన్.. కురుక్షేత్ర నుంచి ఈ సారి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగనున్నారు.