మూడు దశాబ్దాలుగా.. మోదీ మెజార్టీ మార్కును ఎవ్వరూ దాటలే

For three decades, no one could cross Modi's majority mark

Jun 6, 2024 - 22:45
 0
మూడు దశాబ్దాలుగా.. మోదీ మెజార్టీ మార్కును ఎవ్వరూ దాటలే

న్యూఢిల్లీ: గత మూడు దశాబ్దాలుగా ప్రస్తుతం బీజేపీకి వచ్చిన 240 సీట్లను కూడా ఏ పార్టీ సాధించలేకపోయింది. సింగిల్​ గానే బీజేపీ ఈ స్థానాలను కైవసం చేసుకున్న పార్టీగా అవతరించింది. మ్యాజిక్​ మార్కును అటుంచితే ఏ పార్టీలు మేజిక్​ ఫిగర్​ కు ఇంత దగ్గరగా రాలేదు. 1989లో కాంగ్రెస్​ కు 197 సీట్లు మాత్రమే వచ్చాయి. 1991లో 232 సీట్లను మాత్రమే కాంగ్రెస్​ సాధించగలిగింది. 1996లో వాజ్​ పేయి నాయకత్వంలో బీజేపీ 161 సీట్లు సాధించగా కాంగ్రెస్​ కు 140 సీట్లు దక్కాయి. 1998లో బీజేపీ 182 స్థానాలను సాధించింది. కాంగ్రెస్​ కు 141 సీట్లు మాత్రమే వచ్చాయి. 1999లో బీజేపీకి 182 స్థానాలు రాగా కాంగ్రెస్​ కు 114 సీట్లు మాత్రమే వచ్చాయి. 2004లో కాంగ్రెస్​ కు 145 సీట్లు మాత్రమే దక్కాయి. కూటమి సపోర్ట్​ తో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. 2009లో కాంగ్రెస్​ 206 సీట్లను మాత్రమే గెలిచింది. కూటమి సపోర్ట్​ తో తిరిగి అధికారాన్ని చేపట్టింది. ఇక 2014లో బీజేపీ ఒంటరిగానే 282 స్థానాలను దక్కించుకోగా కాంగ్రెస్​ కేవలం 44 స్థానాలకే పరిమితం అయ్యిది. 2019లో బీజేపీ రికార్డును బద్ధలు కొడుతూ సింగిల్​ గానే 303 స్థానాలను సాధించింది. కాంగ్రెస్​ కు కేవలం 52 సీట్లు మాత్రమే దక్కడం విశేషం. ప్రస్తుతం 2024లో బీజేపీకి 240 స్థానాలు దక్కగా, కాంగ్రెస్​ కు కేవలం 99 సీట్లను దక్కాయి. ఏది ఏమైనా మూడు దశాబ్దాలుగా కాంగ్రెస్​ పార్టీ ఒంటరిగా మెజార్టీ మార్కును దాటడంలో తీవ్రంగా విఫలమైందనే చెప్పాలి. అదే సమయంలో బీజేపీ మోదీ హయాంలో మెజార్టీ మార్కులు బద్ధలు కొట్టే స్థానాలను సాధించడం కొసమెరుపు.