పుష్పక్​ ల్యాండింగ్​ విజయవంతం

ఇస్రో చైర్మన్​ సోమనాథ్​ హర్షం

Jun 23, 2024 - 15:01
 0
పుష్పక్​ ల్యాండింగ్​ విజయవంతం

బెంగళూరు: స్వదేశీ అంతరిక్ష నౌక ‘పుష్పక్​’ రీయూజబుల్​ లాంచ్​ వెహికిల్​ ను విజయవంతంగా ల్యాండింగ్​ చేసింది. ఆదివారం ఉదయం చిత్రదుర్గలో సురక్షితంగా ల్యాండింగ్​ చేపట్టారు. దీంతో మూడోసారి ఈ ప్రయోగం పూర్తి విజయవంతమైనట్లు ప్రకటించారు. అంతరిక్ష చరిత్రలో ఇది మరో మైలురాయిగా ఇస్రో చైర్మన్​ సోమనాథ్​ హర్షం వ్యక్తం చేశారు. పుష్పక్​ ను చినూక్​ హెలికాప్టర్​ ద్వారా లాంచ్​ చేశారు. 

సాంకేతికపరంగా పూర్తిగా నిర్దేశించిన దిశలోనే ఇది ఎగురుతూ రన్​ వేపై ల్యాండ్​ అయ్యింది. 4.5 కిలోమీటర్ల ఎత్తులో పుష్పక్​ ను వదిలారు. ప్రస్తుతం ఈ దూరం స్వల్పమే అయినా సాంకేతికతంగా చూసుకుంటే పెద్ద విజయమే అని అన్నారు. రాకెట్​ తనతంట తానే రన్​ వేను నిర్దేశించుకొని దిగడం అంటే కత్తిమీద సామేనన్నారు. ఈ ప్రయత్నం విజయవంతంతో అంతరిక్షంలో భారీగా ఖర్చు తగ్గే అవకాశం ఉందన్నారు.