స్టార్టప్​ తో నింగిలోకి ఉప గ్రహం

స్కై రూట్​ పరీక్ష విజయవంతం వివరాలు వెల్లడించిన వ్యవస్థాపకుడు పవన్​ చందనా

Mar 28, 2024 - 20:37
 0
స్టార్టప్​ తో నింగిలోకి ఉప గ్రహం

శ్రీహరికోట: స్టార్టప్​ సహాయంతో అంతరిక్షంలోకి ఉప గ్రహాన్ని పంపే ప్రయత్నంలో స్కైరూట్​ రాకెట్​ మోటార్​ సఫలమైంది. గురువారం విక్రమ్-1 రాకెట్ స్టేజ్-2ను విజయవంతంగా ఇస్రో నుంచి ప్రయోగించినట్లు సంస్థ వ్యవస్థాపకుడు పవన్ చందనా వివరాలను వెల్లడించారు. తొలిసారిగా భారత్​ లో నిర్మించిన అతిపెద్ద ప్రొపల్షన్ సిస్టమ్ విక్రమ్-1 అని అన్నారు. ప్రయోగం విజయంతో మరో అడుగు ముందుకేసీ త్వరలోనే ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. అన్ని పరీక్షలు సఫలమయ్యాయన్నారు. తొమ్మిది నెలల ముందు స్కై రూట్​ రాకెట్​ ఇంజన్​ ను స్టార్టప్​ సహయాంతో తమిళనాడులో రామన్​–2 ఇంజన్​ ను పరీక్షించామన్నారు. ఈ ప్రయోగాల కోసం ఇప్పటివరకు రూ. 95 మిలియన్లకు పైగా నిధులు సమకూర్చుకున్నామని తెలిపారు. స్కై రూట్​ సీఈవో పవన్​ కుమార్​ చందనా 2018లో ఈ స్టార్టప్​ ను ప్రారంభించారు. దీని ప్రధాన కార్యాలయం హైదరాబాద్​ లో ఉంది. ఈ స్పేస్ స్టార్టప్ మౌలిక సదుపాయాల అభివృద్ధి, సాంకేతికత సృష్టికి కృషి చేస్తోంది. కంపెనీ ప్రకారం, కొత్తగా సేకరించిన మూలధనం ఉపగ్రహ ప్రయోగ సామర్థ్యాన్ని పెంచడానికి ఉపయోగించబడుతుంది.