నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: గొప్ప విద్యావేత్త, తత్వవేత్త, భారతదేశ మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ అని ఆయన యావత్ దేశానికి, ప్రపంచానికి స్ఫూర్తిదాయకంగా నిలిచారని భారత రాష్ర్టపతి ద్రౌపదీ ముర్మూ కొనియాడారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రాష్ర్టపతి భవన్ లో గురువారం సర్వేపల్లి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎంపిక చేసిన 82 మంది ఉపాధ్యాయులకు నేషనల్ టీచర్స్ అవార్డ్ –2024 అవార్డును ప్రదానం చేశారు. ఉపాధ్యాయులు విద్యారంగానికి,విద్యార్థుల ఉన్నతికి చేసిన కృషిని అభినందించారు. ఈ సందర్భంగా రాష్ర్టపతి మాట్లాడుతూ.. ఉపాధ్యాయులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలను తెలిపారు. దేశ యువతను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమన్నారు.
ఉపాధ్యాయులకు అవార్డుతోపాటు మెరిట్ సర్టిఫికెట్, నగదు పురస్కారం రూ. 50,000, రజత పతకం అందించారు. ఎంపికైన 28 రాష్ట్రాలు, మూడు యూటిలు, ఆరు సంస్థల నుంచి ఉపాధ్యాయులను ఎంపిక చేశారు.