వాషింగ్టన్: రాజకీయ, వ్యూహాత్మక, రక్షణ, భద్రత విషయాల్లో భారత్–ఆస్ర్టేలియాలో కలిసి ముందుకు వెళ్లనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. క్వాడ్ లీడర్స్ సమ్మిట్ సందర్భంగా ఆస్ట్రేలియా ప్రధానితో ఆదివారం ప్రధాని మోదీ సమావేశమయ్యారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేయడంపై చర్చించారు. పీఎం ఆంథోనీ అల్బనీస్ తో 2022 నుంచి ప్రధాని క్వాడ్ లో భేటీ కావడం ఇది తొమ్మిదోసారి కావడం గమనార్హం. ఈ సందర్భంగా ఇరువురి మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, విద్య, పరిశోధన, వాతావరణ మార్పులు, పునరుత్పాదక ఇంధనం వంటి విషయాలపై చర్చలు జరిగాయి. ద్వైపాక్షిక బంధాలను మరింత బలోపేతం చేసే అవసరం ఉందని ఇరువురు నిర్ణయించారు. అదే సమయంలో ప్రపంచంలోని యుద్ధ పరిస్థితులున్న దేశాలపై కూడా చర్చించారు. ఆ పరిస్థితులను తొలగించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై మాట్లాడారు. భారత్–ఆస్ర్టేలియా బంధాలు ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్లేందుకు ప్రధాని మోదీ, అంథోనీ అల్బనీస్ లు తమ నిబద్ధతను పునరుద్ఘాటించారు.
ఈ సమావేశంలో, ఇరువురు నాయకులు బహుపాక్షిక వేదికలలో సహకారాన్ని బలోపేతం చేయడానికి మరియు భారతదేశం-ఆస్ట్రేలియా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లడానికి తమ నిబద్ధతను పునరుద్ఘాటించారు.