తలరాతలు మార్చిన బుల్లెట్​!

Bullet that changed heads!

Nov 6, 2024 - 14:39
 0
తలరాతలు మార్చిన బుల్లెట్​!

వాషింగ్టన్​ డీసీ: ట్రంప్​ పై పేలిన బుల్లెట్​ కమలా హారీస్​ కు శరాఘాతంగా మారింది. ఇదే బుల్లెట్​ ట్రంప్​ కు విజయాన్నందించడంలో కీలక పాత్ర వహించింది. స్వింగ్​ రాష్​ర్టాల్లో ఒకటైన పెన్సిల్వేనియాలో డొనాల్డ్​ ట్రంప్​ జూలై 13న ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రసంగిస్తుండగా 2 సెంటీమీటర్లు ఉన్న బుల్లెట్​ ఒకటి ఆయన చెవిని రాసుకుంటూ దూసుకువెళ్లింది. దీంతో ట్రంప్​ చెవికి గాయమైంది. సరిగ్గా 0.05 సెకన్ల ముందు ట్రంప్​ కాస్త పక్కకు జరగడంతో భారీ ప్రమాదం తప్పింది లేకుంటే బుల్లెట్​ నేరుగా తలలోకి దూసుకువెళ్లేది. 

ట్రంప్​ పై దాడికి పాల్పడింది థామస్​ మాథ్యూ క్రూక్స్​ (20)గా పోలీసులు గుర్తించారు. అతని వద్ద నుంచి ఏఆర్​ స్టెల్​ 556 రైఫిల్​ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కాల్పులతో అంతకుముందు సర్వేలో ట్రంప్​ పట్ల ఉన్న వివక్షత కాస్త రానున్న రోజుల్లో ఇష్టంగా మారేందుకు ఎంతో సమయం పట్టలేదు. క్రమేణా ట్రంప్​ వైపు ఓటర్లు మొగ్గుచూపారు. అప్పటివరకు గెలుస్తానని, సర్వేలన్నీ తనకు అనుకూలంగానే ఉన్నాయనుకున్న కమలా హారీస్​ కు ఈ పరిణామం ఒక్కసారిగా ఉలిక్కిపాటుకు గురి చేసింది. అయినా చివరివరకూ కమల హారీస్​ విజయం కోసం తీవ్రంగా శ్రమించింది. అయినా ఓటర్లు డెమోక్రాట్​ పార్టీ వైపు మొగ్గు చూపలేదు. దీంతో హారీస్​ కు ఓటమి తప్పలేదు.