ఆకలితో అలమటించకూడదు సంత్​ గురు రవిదాస్​ ఆశయం గొప్పది

రామ మందిర నిర్మాణంలో సిక్కు సోదరుల పాత్ర మరువలేనిది సరిహద్దుల్లో సేవలకు రుణపడి ఉంటాం దేశాభివృద్ధికి 125 రోజుల రోడ్​ మ్యాప్​ సిద్ధం హ్యాట్రిక్​ కు సమయం ఆసన్నం పంజాబ్​ ప్రచార సభలో ప్రధాని నరేంద్ర మోదీ

May 30, 2024 - 12:37
 0
ఆకలితో అలమటించకూడదు సంత్​ గురు రవిదాస్​ ఆశయం గొప్పది

నా తెలంగాణ, చండీగఢ్​: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు గురు రవిదాస్ తో ప్రేరణ పొంది చేపట్టామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఓ ఒక్క నిరుపేద ఆకలి కడుపుతో ఉండకూడదనే ఆయన ఆశయం చాలా గొప్పదని ప్రధాని తెలిపారు. ఆదంపూర్​ విమానాశ్రయానికి గురు రవిదాస్​ పేరు పెట్టనున్నామని ప్రధాని తెలిపారు. పంజాబ్​ లోని హోషియార్​​ పూర్​ లో గురువారం జరిగిన ఎన్నికల ప్రచార బహిరంగ సభల్లో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. కాగా గురువారం సాయంత్రం 5 గంటలకు ఆఖరి (ఏడో)విడత ఎన్నికల ప్రచారానికి తెరపడనుంది. ప్రధాని ఎన్నికల ప్రచారం చివరిది. ఇక్కడి నుంచ నేరుగా ప్రధాని మోదీ కన్యాకుమారికి బయలుదేరనున్నారు. 

హోషియార్​ పూర్​ సభలో ప్రధాని మాట్లాడుతూ.. రామ మందిర నిర్మాణంలో సిక్కు సోదరుల పాత్ర కూడా ఉందన్నారు. దేశం మీ అభిమానం ఉన్నవారిలో సిక్కుసోదరులు ముందు వరుసలో ఉంటారని పేర్కొన్నారు. సరిహద్దుల్లో వీరి ధైర్యసాహసాలు వివరించే అవసరం లేదన్నారు. సిక్కుల దేశ సేవకు ప్రతీ ఒక్కరు రుణపడి ఉండాలన్నారు.

ఢిల్లీలోని తుగ్లకాబాద్​ లో ఉన్న గురు రవిదాస్​ స్మారకానికి శంకుస్థాపన చేసే అవకాశం తనకు లభించడం తన అదృష్టమన్నారు. ఆ మందిరాన్ని మరింత ఆకర్షణీయంగా, దివ్యంగా తీర్చిదిద్దుతానని పేర్కొన్నారు. దేశ అత్యున్నత న్యాయస్థానం నుంచి కూడా అనుమతులు తీసుకున్నామని ప్రధాని మోదీ వివరించారు.

అధికారంలోకి రాగానే దేశాభివృద్ధి కోసం 125 రోజుల రోడ్​ మ్యాప్​ సిద్ధం చేశామన్నారు. ఈ సమయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రతీఒక్కరికి మోదీ గ్యారంటీ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఇందులో ఎలాంటి వివక్షకు తావీయబోమన్నారు. 

మోదీ ది బలమైన ప్రభుత్వమని పంజాబ్​ ప్రజలు కూడా అంటున్నారని తెలిపారు. ఇక్కడి ప్రజల ఆశీర్వాదం తమకు లభించడం తన అదృష్టంగా భావిస్తానని మోదీ స్పష్టం చేశారు. తమది శత్రువులను సైతం ఒంటిచేత్తో పారద్రోలే ప్రభుత్వమన్నారు. అలాగే అభివృద్ధిని కూడా చేసి చూపించే ప్రభుత్వమని స్పష్టం చేశారు. దేశవిదేశాల్లో ప్రస్తుతం భారతీయులంటే ప్రత్యేక కీర్తి, ప్రతిష్ఠలున్నాయన్నారు. పూర్తి నిజాయితీ, నిబద్ధతో దేశ సేవకు తాను అంకితమయ్యానని ప్రధాని పేర్కొన్నారు. ఇక్కడి ప్రజల ఆశీర్వాదంతో సంపూర్ణ మెజార్టీతో హ్యాట్రిక్​ కు సమయం ఆసన్నమైందన్నారు.