పాక్​ తొలితరం క్రికెటర్​ షహర్యార్​ ఖాన్​ మృతి

భారత మాజీ కెప్టెన్ మన్సూర్ అలీ ఖాన్ పటౌడీకి బంధువు

Mar 23, 2024 - 18:20
 0
పాక్​ తొలితరం క్రికెటర్​ షహర్యార్​ ఖాన్​ మృతి

ఇస్లామాబాద్: పాక్​ తొలి తరం ప్రముఖ క్రికెటర్, భారత మాజీ కెప్టెన్ మన్సూర్ అలీ ఖాన్ పటౌడీకి బంధువు షహర్యార్ ఖాన్ (89) శనివారం మృతి చెందాడు. ఈ విషయాన్ని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అభిమానులతో పంచుకుంది. షహర్యార్ ఖాన్ చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఇతను భోపాల్‌లో జన్మించాడు. 1990,1994 మధ్య పాకిస్తాన్ విదేశాంగ కార్యదర్శిగా కూడా పనిచేశాడు. భారత్, యూకెలకు పాక్​ తరఫున హైకమిషనర్​గా కూడా పనిచేశాడు. షహర్యార్ 2003,2006 మధ్య మొదటిసారిగా పీసీబీ చైర్మన్ అయ్యాడు. 2000వ దశకం ప్రారంభంలో భారత్‌తో క్రికెట్ సంబంధాలను పునరుద్ధరించడంలో షహర్యార్ ఖాన్ కీలక పాత్ర పోషించాడు.