అవినీతి ఆరోపణలు మాజీ బ్యాంకర్​ కు మరణశిక్ష

చైనా కోర్టు కఠిన నిర్ణయం

May 29, 2024 - 19:41
 0
అవినీతి ఆరోపణలు మాజీ బ్యాంకర్​ కు మరణశిక్ష

బీజింగ్​: అవినీతి ఆరోపణల కేసులో బ్యాంకర్​ కు చైనా కోర్టు మరణశిక్ష విధించింది. బుధవారం కఠిన తీర్పు నిర్ణయాన్ని వెల్లడించింది. చైనా హువారోంగ్ ఇంటర్నేషనల్ హోల్డింగ్స్ (సిహెచ్‌ఐహెచ్) మాజీ జనరల్​ మేనేజర్​ టియాన్‌హుయ్‌ 151 మిలియన్​ డాలర్ల లంచాన్ని తీసుకున్నారని నిర్ధరించింది. అతనికి మరణశిక్ష విధిస్తున్నట్లు తీర్పు వెలువరించింది. దీంతో లంచం రూపంలో టియాన్​ హుయ్​ తీసుకున్న మొత్తాన్ని స్వాధీనం చేసుకోనున్నారు. స్వాధీనం చేసుకున్న మొత్తాన్ని ప్రభుత్వ ఖాతాలో జమ చేయనున్నారు. ఈ మొత్తాన్ని చైనా అభివృద్ధి పనులకు వినియోగిస్తారని మీడియా తెలిపింది. చైనాలో లంచం తీవ్రతను బట్టి శిక్షలు వేస్తారు. అవినీతి ఆరోపణల్లో అత్యధిక శిక్షగా మరణశిక్షను కూడా విధించే చట్టం చైనాలో ఉంది. 

శిక్ష అంగీకరించిన వారికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తారు. శిక్ష అంగీకరించని వారికి మాత్రం నిందితులే దోషులుగా నిర్ధరణ అయితే  మరణశిక్ష విధిస్తారు. జిన్​ పింగ్​ అధికారం చేపట్టాక అవినీతి కేసుల్లో పలు మార్పులు తీసుకువచ్చారు.