ఆర్బీఐ నూతన గవర్నర్ గా సంజయ్ మల్హోత్రా
Sanjay Malhotra is the new Governor of RBI
కేంద్ర కేబినెట్ ఉత్తర్వులు జారీ
డిసెంబర్ 11న ప్రమాణ స్వీకారం
మంగళవారంతో ముగియనున్న శక్తికాంతదాస్ పదవీకాలం
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ఆర్బీఐ నూతన గవర్నర్ గా సంజయ్ మల్హోత్రాను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయంపై కేబినెట్ సెక్రెటరీ మనీషా సక్సెనా సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. 11వ తేదీన సంజయ్ మల్హోత్రా ప్రమాణ స్వీకారం చేపట్టనున్నారు. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ పదవీకాలం మంగళవారంతో ముగియనుంది. ఈ నేపథ్యంలో కేంద్రం సంజయ్ మల్హోత్రాను నూతన గవర్నర్ గా నియమించింది. రెవెన్యూ కార్యదర్శిగా ఉన్న సంజయ్ మల్హోత్రా మూడేళ్లపాటు ఆర్బీఐ గవర్నర్ గా పదవిలో కొనసాగనున్నారు. మల్హోత్రా ఆర్బీకి 26వ గవర్నర్ గా విధులు చేపట్టనున్నారు.
కాగా సంజయ్ మల్హోత్రా ప్రధాని మోదీ ప్రశంసలు పొందుతున్న వారిలో ఒకరు. ఆర్థిక విషయాలలో ఈయన బలమైన విధానాలను పలుమార్లు ప్రధాని ప్రశంసించారు. మల్హోత్రా తొలుత రాజస్థాన్ లో అన్ని విభాగాల్లో పనిచేశారు. అటు పిమ్మట కేంద్ర ఆర్థిక శాఖకు వచ్చారు. ఏదైనా ఆర్థిక సమస్యను పరిష్కరించడంలో సిద్ధహస్థుడిగా ఈయన పేరు పొందారు.
శక్తికాంత దాస్ 2018, డిసెంబర్12న గవర్నర్‌గా నియమితులయ్యారు. ఆ తర్వాత శక్తికాంత దాస్ పదవీకాలాన్ని మరో మూడేళ్లపాటు పొడిగించారు. దాస్ హయాంలో గణనీయమైన వృద్ధికి పునాదులు వేయగలిగారు. కేంద్రం ఆకాంక్షలను నెరవేర్చారు.