ఆక్రమిస్తామంటే లాలీపాప్ లు తింటూ కూర్చొంటామా?
బంగ్లాదేశ్ బీఎల్పీ ప్రకటనపై సీఎం మమత భగ్గు
కోల్ కతా: పశ్చిమ బెంగాల్, అసోం, బిహార్, ఒడిశాలను ఆక్రమిస్తామంటే తామేమి కూర్చొని లాలీపాప్ లు తింటూ కూర్చుంటామా? అని మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం బంగ్లాదేశ్ నాయకుల విభిన్న ప్రకటనలపై కోల్ కతా అసెంబ్లీలో సీఎం మమతా బెనర్జీ విరుచుకుపడ్డారు. ఆదివారం బీఎన్ పీ బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ భారత వ్యతిరేక ప్రకటనపై సీఎం మమత మండిపడ్డారు. ఇక్కడ ఉన్న వారు నిర్భయంగా ఉండవచ్చని, ఆక్రమిస్తామంటే తమ విధానం ఏంటో చూపిస్తామని హెచ్చరించారు. ప్రజలు ప్రశాంతంగా ఉండాలన్నదే తమ అభిమతమన్నారు. దాన్ని కాపాడుకోవాలన్నారు. బంగ్లాదేశ్ కూడా భారత్ లానే విభిన్న మతాల సమాహారమన్నారు. అందుకే షేక్ హసీనా 16యేళ్లపాటు పాలించారన్నారు. బంగ్లాలో న్యాయవాది హత్య దారుణమన్నారు. భారత్ లో ఉన్న ముస్లిం ఇమామ్ లు కూడా బంగ్లా దాడులను ఖండించారని తెలిపారు. మరింత పరిస్థితులు దిగజారకుంగా చూసుకుంటేనే ఆ దేశానికి మంచిదన్నారు. బంగ్లా పరిస్థితులపై ఎవ్వరూ మాట్లాడినా, ప్రకటనలిచ్చినా మీడియా కూడా సంయమనం పాటించాల్సిన అవసరం ఉందన్నారు. పశ్చిమ బెంగాల్ లో ప్రజాప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొనే పనిచేయాలని మమతా బెనర్జీ అన్నారు.