ఎన్​ హెచ్​ ఆర్​ సీ దినోత్సవంలో రాష్ట్రపతి

డిసెంబర్​ 10న న్యూఢిల్లీలో నూతన థీమ్​ తో నిర్వహణ

Dec 9, 2024 - 19:19
 0
ఎన్​ హెచ్​ ఆర్​ సీ దినోత్సవంలో రాష్ట్రపతి

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: మానవ హక్కుల దినోత్సవం డిసెంబర్​ 10 సందర్భంగా మంగళవారం న్యూ ఢిల్లీ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ ప్రసంగించనున్నారు. న్యూ ఢిల్లీలో నిర్వహించే కార్యక్రమంలో అధ్యక్షురాలు పాల్గొంటుందని ఎన్​ హెచ్​ ఆర్​ సీ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ సంవత్సరం ‘ప్రస్తుతం హక్కులు, మా భవిష్యత్తు’ అనే థీమ్​ కార్యక్రమంలో రాష్ట్రపతి పాల్గొంటారు. హక్కులు మెరుగైన భవిష్యత్తును సృష్టించేవిగా, సంఘాలను బలోపేతం చేసేవిగా ఆచరణాత్మక సాధనంగా ఉండాలని ఈ థీమ్​ ముఖ్య ఉద్దేశ్యం. దేశవ్యాప్తంగా మానవ హక్కుల ఉల్లంఘనలకు సంబంధించి 23 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయని, బాధితులకు రూ. 256 కోట్ల రూపాయల సాయం అందించాలని సిఫార్సు చేసినట్లు ఎన్ హెచ్​ ఆర్సీ తెలిపింది. జాతి, రంగు, మతం, లింగం, భాష, రాజకీయ ఇతర​ అభిప్రాయాలతో సంబంధం లేకుండా ప్రతీ ఒక్కరికి సమాన హక్కులు అందాలనే ఉద్దేశ్యంతో 1948లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ మానవ హక్కులను ఆమోదిందించింది. ఈ నేపథ్యంలో భారత్​ లో కూడా ప్రతీయేటా డిసెంబర్​ 10న మానవహక్కుల దినోత్సవంగా నిర్వహిస్తున్నారు.