అంతర్జాతీయ డ్రగ్స్​ కేసులో సాదిక్​ అరెస్ట్​

50 కిలోలు డ్రగ్స్​ స్వాధీనం

Mar 9, 2024 - 17:40
 0
అంతర్జాతీయ డ్రగ్స్​ కేసులో సాదిక్​ అరెస్ట్​

చెన్నై: అంతర్జాతీయ డ్రగ్స్​అక్రమ రవాణా కేసులో ఎన్​సీబీ అధికారులు పురోగతి సాధించారు. తమిళనాడుకు చెందిన ప్రముఖ సినీ నిర్మాత, డీఎంకే నేత ఆర్​జాఫర్​ సాదిక్ ​ను పోలీసులు శనివారం అరెస్టు చేశారు. ఈ విషయంపై అధికారులు వివరాలందించారు. డ్రగ్స్​ కేసుపై గత నెలలో అధికారులు సంయుక్తంగా ఆపరేషన్​ చేపట్టి ఈ నెట్ ​వర్క్ ​ను ఛేదించారు. ఈ కేసులో కొందరిని అదుపులోకి తీసుకొని 50 కిలోల సూడోఎఫిడ్రిన్ ​ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిర్మాత సాదిక్​ కోసం తీవ్రంగా వెతగ్గా అతను తప్పించుకుని తిరిగాడన్నారు. ఎట్టకేలకు అతడిని అదుపులోకి తీసుకున్నామని ప్రకటించారు. ఈ నెట్ వర్క్​ భారత్, న్యూ జిలాండ్, ఆస్ట్రేలియా, మలేషియాలకు విస్తరించినట్లు పేర్కొన్నారు. హెల్త్ మిక్స్ పౌడర్, ఎండు కొబ్బరి వంటి ఆహార పదార్థాల ముసుగులో సరుకుల ద్వారా డ్రగ్స్​ అక్రమంగా రవాణా చేస్తున్నట్లు గుర్తించామని తెలిపారు. గత మూడేళ్లలో 45 సార్లు సరుకులు పంపారని, అందులో 3500 డ్రగ్స్​ బిళ్లలున్నట్లు వివరించారు. అంతర్జాతీయ మార్కెట్​లో వీటి విలువ రూ. 2వేల కోట్లని తెలిపారు. ఈ నెట్ ​వర్క్ ​ను ఛేదించేందుకు ఆయా దేశాల పోలీసులతో కూడా సంప్రదింపులు జరిపామని వెల్లడించారు. 

డీఎంకే పార్టీ నేత సాదిక్..

కాగా జాఫర్​ సాదిక్​ డీఎంకే పార్టీ నాయకుడు. డ్రగ్స్​ విషయంలో ఇతని పాత్రపై వచ్చిన ఆరోపణలతో పార్టీ ఇతన్ని సస్పెండ్​ చేసింది. క్రమశిక్షణ ఉల్లంఘించి పార్టీకి చెడ్డ పేరు తెచ్చినందుకు గాను అతన్ని సస్పెండ్​ చేస్తున్నట్లు ప్రకటించింది.