జమ్మూకశ్మీర్​ లో 58.85 శాతం పోలింగ్​

58.85 percent polling in Jammu and Kashmir

Sep 18, 2024 - 20:35
 0
జమ్మూకశ్మీర్​ లో 58.85 శాతం పోలింగ్​
శ్రీనగర్​: జమ్మూకశ్మీర్​ లోని స్వల్ప ఆందోళనలు, ఉద్రిక్తతల మధ్య ఏడు జిల్లాల్లోని 24 స్థానాల్లో ప్రశాంతంగా పోలింగ్​ కొనసాగింది. బుధశారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్​ 6 గంటల వరకూ కొనసాగింది. 58.85 శాతంగా పోలింగ్​ నమోదైంది. అత్యధికంగా కిష్త్వాడ్​ లో 77.23 శాతం పోలింగ్​ నమోదు కాగా, అత్యల్పంగా పుల్వామా 46.03 శాతం పోలింగ్​ నమోదైంది. దోడా 63.33 శాతం, రాంబన్​ 67.71 శాతంతో రెండు, మూడో స్థానాల్లో నిలిచాయి. 
కిష్త్వార్‌లోని బగ్వాన్ ప్రాంతంలో గుర్తింపు కార్డులు లేకుండా ఓట్లు వేశారని బీజేపీ అభ్యర్థి షాగున్ ఆరోపించారు. దీంతో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కడంతో కొద్దిసేపు ఓటింగ్‌ ప్రక్రియకు ఆటంకం ఏర్పడింది. 
దోడాలో 69.33 శాతం, కిష్త్వాడ్​ లో 77.23 శాతం, కుల్గామ్​ లో 61.57 శాతం, పుల్వామాలో 46.03 శాతం, రాంబన్​ లో 67.71 శాతం, షోపియాలో 53.64 శాతం పోలింగ్​ నమోదైంది. 
 
పీడీపీకి చెందిన 21 మంది అభ్యర్థులలో 18 మంది కోటీశ్వరులున్నారు. అత్యంత కోటీశ్వరులు పీడీపీలో ఇద్దరుండగా అప్ని పార్టీలో ఒక్కరున్నారు. అత్యల్ప సంపదలో ఇద్దరు స్వతంత్రులుండగా, ఒకరు ఆప్​ పార్టీ అభ్యర్థి ఉన్నారు. వీరి సంపద కేవలం 10వేలుగా ఉండడం విశేషం. పీడీపీ అభ్యర్థులపై అత్యధికంగా క్రిమినల్​ కేసులు ఉన్నాయి.