సామాన్యుల సంక్షేమం కోసం జైట్లీ కృషి ఎనలేనిది
ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ కర్
నా తెలంగాణ, ఢిల్లీ: అరుణ్‌జైట్లీ రాజకీయ నాయకుడు మాత్రమే కాదు పార్టీలకతీతంగా భిన్నమైన రాజకీయ పాత్ర పోషించిన ప్రజా సేవకుడని ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ కర్ అన్నారు. సామాన్యుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేసిన మహనీయుడని కొనియాడారు. ఢిల్లీలోని శ్రీ రామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్‌లో అరుణ్ జైట్లీ మల్టీపర్పస్ స్టేడియాన్ని అరుణ్ జైట్లీ స్టేడియంగా పేరు మార్చారు. ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి జగదీప్ శనివారం పాల్గొన్నారు. జైట్లీ నేడు మన మధ్యలో లేకపోవడం తీవ్ర విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో విద్యార్థులు మార్పుకోసం కృషి చేయాలన్నారు. రానున్న కాలంలో ప్రధాని మోదీ నేతృత్వంలో అతిపెద్ద ఆర్థిక దేశంగా భారత్ ఎదగబోతోందన్నారు. ఇందుకు అన్ని వర్గాల సహాయ సహకారాలు ముఖ్యమని తెలిపారు. అవినీతిపై ప్రతి ఒక్కరూ గళమెత్తాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. అవినీతి అనేది దేశానికి నష్టం వాటిల్లేలా చేస్తున్నదని తెలిపారు. దేశంలో అందరికీ సమాన అవకాశాలు ఇవ్వాలని ప్రధాని కుటుంబ, అవినీతి, కుంభకోణాల రాజకీయాలపై నిక్కచ్చిగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. చట్టానికి ప్రతిఒక్కరూ జవాబుదారీగా ఉండాలని తెలిపారు. దేశ భవిష్యత్తును కాపాడడంలో యువతదే కీలక పాత్ర అని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ కర్ చెప్పారు.