స్టాలిన్ కోర్టులో హాజరుకావాల్సిందే
సనాతనంపై అసభ్యకర వ్యాఖ్యలు.. భోజ్పూర్ కోర్టు ఆదేశాలు
భోజ్పూర్: సనాతన ధర్మంపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్విచారణకు కోర్టులో హాజరు కావాలని భోజ్పూర్ కోర్టు స్పష్టం చేసింది. హాజరు కాని పక్షంలో చర్యలు తీసుకోవాలని రాష్ర్ట ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. మంగళవారం ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై పిటిషన్ను కోర్టు విచారణకు స్వీకరించింది. ఐపీసీ 298 కింద విచారణ జరిగింది. 2023 సెప్టెంబర్ 23న ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలు చేశారని కోర్టు సీనియర్ న్యాయవాది ధరణిధర్ పాండే తెలిపారు. సనాతన ధర్మంపై అసంబద్ధ, అసత్య, అసభ్యకర వ్యాఖ్యలపై జిల్లా చీఫ్ జ్యూడీషియల్ మేజిస్ర్టేట్కు ఫిర్యాదు చేశారు. హిందువులు పాటిస్తున్న సనాతన ధర్మంపై స్టాలిన్ వ్యాఖ్యలు తీవ్ర బాధాకరమన్నారు. ఈ ప్రసంగం వల్ల యావత్హిందువులకు బాధకలిగిందని, వారి మనోభావాలను దెబ్బతీశాయని ఆవేదన వ్యక్తం చేస్తూ కోర్టుకు వివరించారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు 2024 ఏప్రిల్ 1 వరకు విచారణకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే ఉదయనిధి వ్యాఖ్యలపై మరికొన్ని ఫిర్యాదులు కూడా అందిన నేపథ్యంలో 120(బి), 153(ఎ), 153(బి), 295(ఎ), 298 సెక్షన్ల కింద విచారణ చేపట్టనున్నారు.