21మంది జనసేన ఎమ్మెల్యేలకు శిక్షణ
Training for 21 Janasena MLAs
విజయవాడ: ఎన్నికల్లో గెలుపొందిన జనసేన 21 మంది ఎమ్మెల్యేలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించాలని ఆ పార్టీ అధిష్టానం నిర్ణయించింది. అధినేత పవన్ కళ్యాణ్ నేతృత్వంలో శిక్షణనివ్వనున్నట్లు సమాచారం. జూన్ 25న ఎమ్మెల్యేలకు శిక్షణ నివ్వనున్నారు. ఎమ్మెల్యేలకు శిక్షణను ఇచ్చే వారిలో నాదెండ్ల మనోహర్, బుద్ధ ప్రసాద్ లు ఉన్నారు. అసెంబ్లీలో సభా నిబంధనలు, సంప్రదాయాలు, ప్రసంగాలు వ్యవహరించాల్సిన తీరుపై శిక్షణనివ్వనున్నారు.