పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన ఎస్పీ
SP who inspected the police station
నా తెలంగాణ, సంగారెడ్డి: బొల్లారం పోలీస్ స్టేషన్ లో ఎస్పీ చెన్నూరి రూపేష్ గురువారం తనిఖీలు నిర్వహించారు. పోలీసు స్టేషన్ ఆవరణ, సిబ్బంది బ్యారెక్ పరిశుభ్రత, అండర్ ఇన్వెస్టిగేషన్ కేసులను, స్టేషన్ రికార్డులను పరిశీలించారు. పరిశ్రమల్లో పనిచేస్తున్న ఇతర రాష్ర్టాల వారు, సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు ఈ ప్రాంతం కీలకంగా ఉంటుందన్నారు. దీంతో ఇతర రాష్ర్టాలలోని కొందరు దొంగతనాలకు పాల్పడే అవకాశం ఉందని తరచూ వాహనాల తనిఖీ చేపట్టాలన్నారు. రౌడీషీటర్లు, సస్పెక్ట్ లపై దృష్టి పెట్టాలన్నారు. ఆన్ లైన్ లో ఎప్పటికప్పుడు రికార్డులను అప్ లోడ్ చేయాలన్నారు. ఇన్వెస్టిగేషన్ లో న్యాయం పక్షం వహించాలని ఎస్పీ సూచించారు. నిషేధిత పదార్థాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. విధి నిర్వహణలో నిబద్దతతో ఉండాలని తమకు కేటాయించిన విధిని సక్రమంగా నిర్వహించినప్పుడే అధికారుల మన్ననలు పొందుతారని, చేసిన పనికి గుర్తింపు లభిస్తుందని సిబ్బందికి సూచించారు. జిల్లా ఎస్పీ వెంట అదనపు ఎస్పీ ఎ.సంజీవ రావ్, పటాన్ చెరువు డీఎస్పీ రవీందర్ రెడ్డి, బొల్లారం యస్.హెచ్.ఒ గంగాధర్, ఇన్స్ పెక్టర్, ఎస్ఐ రాములు సిబ్బంది ఉన్నారు.