జైలు తనిఖీ చేసిన జిల్లా న్యాయమూర్తి

District Judge who inspected the jail

Oct 24, 2024 - 20:46
 0
జైలు తనిఖీ చేసిన జిల్లా న్యాయమూర్తి

నా తెలంగాణ, సంగారెడ్డి టౌన్: సంగారెడ్డి జిల్లా కందిలోని సెంట్రల్​ జైలును జిల్లా న్యాయాధికారి జి.భవానీ చంద్ర గురువారం తనిఖీ నిర్వహించారు. జైలులో ఉన్న బ్యారక్​ లు, గదులు, వంట గది, బాత్రూంలు జైలు ఆవరణ మొత్తం తిరిగి పరిశీలించారు. జైలులో సదుపాయాలు, భోజనం గురించి ఖైదీలను అడిగి తెలుసుకున్నారు. ఖైదీలకు సదుపాయాలను అందించాలని జైలు సూపరింటెండెంట్ ను ఆదేశించారు. ములాఖత్​ లకు సమయం కేటాయించాలన్నారు. కేసులు పరిష్కరించేందుకు న్యాయ సేవలు పొందేందుకు ఉచితంగా న్యాయవాదిని నియమిస్తామని ఖైదీలకు తెలిపారు. జైల్లో ఉన్న లీగల్ ఎయిడ్ క్లినిక్ పరిశీలించారు. ఈ తనిఖీలో న్యాయధికారి వెంట జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.రమేష్  జైలు సూపరింటెండెంట్ సంతోష్ కుమార్ రాయ్, జైలు సిబ్బంది తదితరులు ఉన్నారు.