ఇందిరమ్మ కమిటీల జీవో చెల్లదు

హైకోర్ట్ లో బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి పిటిషన్

Oct 24, 2024 - 20:20
 0
ఇందిరమ్మ కమిటీల జీవో చెల్లదు

నా తెలంగాణ, నిర్మల్: ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుల ఎంపిక కోసం గ్రామ పంచాయతీ, మున్సిపల్ వార్డుల స్థాయిలో ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటు చేస్తూ రోడ్లు, భవనాల శాఖ జారీ చేసిన జీవో 33 చెల్లదని పేర్కొంటూ హై కోర్ట్ లో బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం, రాజ్యాంగానికి వ్యతిరేకంగా జీవో జారీ చేశారని, గ్రామ సభ ప్రస్తావన లేకుండా లబ్దిదారుల ఎంపిక అక్రమమని పిటిషనర్ తరఫు న్యాయవాది పేర్కొన్నారు. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన జస్టిస్ నగేష్ భీమపాక ధర్మాసనం, తమ వైఖరి తెలియజేయాలంటు రోడ్లు, భవనాల శాఖ, హౌసింగ్ కార్పొరేషన్ తదితర శాఖలకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ ఈ నెల 28కి వాయిదా వేసింది.