ఆరోవార్డు పనులపై జగ్గారెడ్డికి వినతిపత్రం అందజేత
Jaggareddy was presented with a petition on the works of Auroward
నా తెలంగాణ, సంగారెడ్డి టౌన్: సంగారెడ్డి పట్టణంలో ఆరో వార్డు కౌన్సిలర్ సోహెల్ అలీ సంగారెడ్డి పీసీసీ అధ్యక్షులు జగ్గారెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఆరో వార్డులో ఉన్న అండర్ డ్రైనేజీ, సీసీ రోడ్ల నిర్మాణం పార్కు అదనంగా వీధిలైట్లు ఏర్పాటు పూర్తిచేయాలని దానికి సంబంధించిన బడ్జెట్, వివరాలతో కూడిన వినతిపత్రం అందజేశారు. జగ్గారెడ్డి స్పందిస్తూ సంగారెడ్డి పట్టణంలోని పారిశుధ్యమే చాలా ముఖ్యమని వెంటనే పనుల కోసం బడ్జెట్ ను విడుదలకు కృషి చేస్తానని జగ్గారెడ్డి హామీ ఇచ్చారు. వార్డులో పార్కు పనులను సైతం అధికారులను పిలిపించుకొని పూర్తి చేయిస్తామని శానిటేషన్ పనులు వీధిలైట్లు చెత్త సేకరణ వంటి పనులను పూర్తిచేసేలా సహకరిస్తామని జగ్గారెడ్డి తెలిపారు.