నా తెలంగాణ, సంగారెడ్డి: తల్లి బిడ్డల సంక్షేమం కోసమే పోషణ అభియాన్ కార్యక్రమం ప్రవేశ పెట్టారని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. కలెక్టరేట్‌లోని ఆడిటోరియంలో శుక్రవారం నిర్వహించిన జాతీయ పోషణ అభియాన్ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడారు.
పోషణ అభియాన్ లో కిశోర బాలికల రక్తహీనత నిర్మూలనకు చర్యలు చేపట్టాలన్నారు. గర్భిణీ స్త్రీలకు ముర్రుపాల ఆవశ్యకత మీద అవగాహన కల్పించాలని సూచించారు. నిర్వహించే అన్ని అంగన్ వాడీ కేంద్రాల్లో కిచెన్ అభియాన్ కార్యక్రమంలో తల్లిగా, బిడ్డలకు సంపూర్ణ పోషకాహారం తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించాలని కలెక్టర్ క్రాంతి వల్లూరు అధికారులకు సూచించారు. సిబ్బంది జాతీయ పోషణ మాసం సందర్భంగా ప్రతీ ఇంటికి వెళ్లి పిల్లల పోషణ, పోషకాహారం, పరిశుభ్రత వివరాలను వెల్లడించాలన్నారు. 1504 అంగన్ వాడీ కేంద్రాల్లో పోషణ్ అభియాన్ ను పక్కాగా అమలు చేసే కలెక్టర్ పర్యవేక్షణ.
అంగన్ వాడీ, ఆశ, వైద్య సిబ్బంది సమన్వయంతో పనిచేస్తూ ముర్రుపాల అవశ్యతపై అవగాహన కల్పించాలన్నారు. రాగులు, జొన్నలు, చిరుధాన్యాలు, ఆకుకూరలు వాటి పోషక విలువలపై అవగాహన కల్పించాలన్నారు.
గర్భిణీ స్త్రీలకు సామూహిక శ్రీమంతం, చిన్నారులకు అక్షరాభ్యాసం, అన్నప్రాసన వంటి కార్యక్రమాలను నిర్వహించాలన్నారు.
అదనపు కలెక్టర్ చంద్ర మాట్లాడుతూ ఏడో జాతీయ పోషణ అభియాన్ కార్యక్రమంలో భాగంగా మహిళలకు, అంగన్ వాడీ సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. సంపూర్ణ ఆరోగ్య ప్రాధాన్యతను వివరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారిణి డా. గాయత్రీ దేవి, జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు, మెప్మా పీడీ గీత, సీడీపీవోలు సూపర్ వైజర్లు, అధికారులు, అంగన్ వాడీ సిబ్బంది, గర్భిణీలు, మహిళలు చికిత్స పొందుతున్నారు.