మహిళా కానిస్టేబుల్​ పై ఎస్​ ఐ భవానీ లైంగిక వేధింపులు

అరెస్టు, విచారణ

Jun 19, 2024 - 15:35
 0
మహిళా కానిస్టేబుల్​ పై ఎస్​ ఐ భవానీ లైంగిక వేధింపులు

నా తెలంగాణ, హైదరాబాద్: కాళేశ్వరం ఎస్​ ఐ భవానీ సేన్​ పై లైంగిక వేధింపుల ఆరోపణలకు పాల్పడి అరెస్ట్​ అయ్యాడు. మహిళా కానిస్టేబుల్​ ఫిర్యాదుతో బుధవారం ఎస్​ భవానీని పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు. కాళేశ్వరం పోలీస్​ స్టేషన్​ లో విధులు నిర్వహిస్తున్న రమ అనే మహిళా హెడ్​ కానిస్టేబుల్​ తనపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. 

ఎస్​ ఐ వ్యవహారంపై ఇద్దరు డీఎస్పీలు, సీఐ విచారణ చేపట్టారు. వేధింపులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద కేసు నమోదు చేశారు. అయితే ఈ ఎస్​ ఐపై గతంలో కూడా అనేక ఫిర్యాదులున్నాయి. దీంతో గతంలోనే బదిలీ వేటు వేశారు. ఆసిఫాబాద్​ లో కూడా యువతిపై వేధింపుల ఆరోపణలు ఎదుర్కోవడంతో బదిలీ వేటు వేశారు. మహిళా కానిస్టేబుల్​ ఆరోపణలు నిజమని తేలితే ఎస్​ భవానీకి జైలు తప్పదు.