డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్ బాధ్యతల స్వీకరణ

Pawan Kalyan assumed charge as Deputy CM

Jun 19, 2024 - 15:43
 0
డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్ బాధ్యతల స్వీకరణ

విజయవాడ: జనసేన అధినేత పవన్​ కళ్యాణ్​ బుధవారం డిప్యూటీ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టారు. విజయవాడలోని డిప్యూటీ సీఎం క్యాంప్​ ఆఫీస్​ లో తనకు కేటాయించిన సీటులో పూజాతి కార్యక్రమాల అనంతరం ఆసీనులయ్యారు. పవన్​ కళ్యాణ్​ కు డిప్యూటీ సీఎంతోపాటు పంచాయతీరాజ్​, గ్రామీణాభివృద్ధి, నీటి సరఫరా, అటవీ, పర్యావరణం, శాస్ర్త సాంకేతిక శాఖల బాధ్యతలను కూడా చేపట్టారు. 

బాధ్యతలు చేపట్టేముందు ఇంద్రకీలాద్రిలో దుర్గమ్మ వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ వేదపండితుల ఆశీర్వచనాలు తీసుకున్నారు. బాధ్యత చేపట్టాక ఉపాధి హామీ పథకం, ఉద్యానవన పనులకు సంబంధించి నిధుల మంజూరుపై తొలి సంతకం చేయగా, గిరిజన గ్రామాల్లో పంచాయతీ భవనాల నిర్మాణానికి సంబంధించి రెండో సంతకం చేశారు.