గుడుంబా స్థావరాలపై  పోలీసుల దాడులు

Police raids on Gudumba settlements

Jun 19, 2024 - 14:46
 0
గుడుంబా స్థావరాలపై  పోలీసుల దాడులు

నా తెలంగాణ, డోర్నకల్: గుడుంబా స్థావరాలపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. బుధవారం మహబూబాబాద్​ జిల్లా మరిపెడ మండలంలోని గాలివారిగూడెం శివారు తిలవత్​ తండాలో గుడుంబా స్థావరాలపై ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 500 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేయగా, 50 లీటర్ల గుడుంబాని స్వాధీనం చేసుకున్నారు. ఐదుగురుపై కేసు నమోదు చేశారు. ఈ దాడుల్లో ఎస్​ ఐలు హాథిరామ్ నాయక్, సంతోష్, మరిపెడ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.