ప్రైవేట్​ హాస్టల్​ లో విద్యార్థి మృతి!

A student died in a private hostel!

Jun 25, 2024 - 14:42
 0
ప్రైవేట్​ హాస్టల్​ లో విద్యార్థి మృతి!

నా తెలంగాణ, హైదరాబాద్: కొంపల్లిలో ప్రైవేట్​ స్కూల్​ హస్టల్​ లో విద్యార్థి మృతి చెందడం తీవ్ర కలకలం సృష్టిస్తోంది. సోమవారం రాత్రి భోజనం చేసి పడుకున్న 7వ తరగతి విద్యార్థి మల్లిఖార్జున్​ మంగళవారం ఉదయం నిద్ర లేకపోవడంతో నిర్వాహకులు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే విద్యార్థి మృతిచెందినట్లు ఆసుపత్రి వర్గాలు నిర్ధారించాయి. దీంతో హాస్టల్​ వార్డెన పేట్​ బషీరాబాద్​ పోలీసులకు సమాచారం అందించాడు. బాలుడు గుండెపోటుతో మృతిచెందినట్లుగా హాస్టల్​ సిబ్బంది చెబుతున్నారు. మరోవైపు ఈ పాఠశాల యాజమాన్య వైఖరిపై విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకొని మృతదేహానికి పోస్టుమార్టం కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. రిపోర్టులు అందాక చర్యలకు ఉపక్రమిస్తామని తెలిపారు.