హమాస్​ చెరలో ఐదుగురు ఇజ్రాయెల్​ మహిళా సైనికులు

రక్తం, గాయాలతో ఉన్న వీడియో విడుదల భేషరతుగా విడవకుంటే ఎవ్వరిమాట వినేది లేదని నెతన్యాహు హెచ్చరిక

May 23, 2024 - 13:41
 0
హమాస్​ చెరలో ఐదుగురు ఇజ్రాయెల్​ మహిళా సైనికులు

జేరూసలెం: హమాస్​ చెరలో ఉన్న ఇజ్రాయిల్​ ఐదుగురు మహిళా సైనికుల వీడియోలను గురువారం హమాస్​ గ్రూప్​ విడుదల చేసింది. ఈ వీడియోలో మహిళా సైనికుల పరిస్థితి దారుణంగా ఉన్నట్లుగా స్పష్టం అవుతోంది. మహిళల ఒళ్లంతా రక్తపు మరకలు గాయాలు కనిపిస్తున్నాయి. కాళ్లు చేతులపైన గాయాలతో కుంటుతూ నడుస్తుండడం ఈ వీడియోలో కనిపిస్తుంది. వీరందరి చేతులను ఉగ్రవాదులు కట్టివేసి ఉన్న వీడియోలను రిలీజ్​ చేశారు. ఈ మహిళా సైనికులను ఇజ్రాయెల్​ గాజా సరిహద్దు సమీపంలోని నహల్ ఓజ్ బేస్ వద్ద మోహరించగా అక్టోబర్​ 7న జరిగిన దాడి సందర్భంగా వీరిని హమాస్​ గ్రూప్​ కిడ్నాప్​ చేసింది. 

కాగా ఈ వీడియోపై ఇజ్రాయెల్​ ప్రధాని నెతన్యాహూ స్పందించారు. బందీలను వెంటనే బేషరతుగా విడుదల చేయకుంటే పరిస్థితులు మరింత ఘోరంగా తయారవుతాయని ఇక ఏ మూలన హమాస్​ ఉగ్రవాదులున్నా వదలబోమని హెచ్చరించారు. వీడియో విడుదలతో ఇజ్రాయెల్​ ను భయపెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. దీనికి ప్రతీకారం తప్పదని ఈ విషయంలో ఎవ్వరి మాట వినబోమని నెతన్యాహు స్పష్టం చేశారు.