ఘనంగా రాజీవ్ జయంతి వేడుకలు
Grand Rajiv Jayanti celebrations
నా తెలంగాణ, ఆదిలాబాద్: మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని, యువతను ప్రజాస్వామ్యంలో భాగస్వాములను చేయాలనే ఉద్దేశంతో 18 సంవత్సరాలకే వారికి ఓటుహక్కు కల్పించారని, టెక్నాలజీ రంగాన్ని అభివృద్ధి పర్చారని డీసీసీబీ చైర్మెన్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు అడ్డి భోజారెడ్డి అన్నారు.
జిల్లా కేంద్రంలోని కంది శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయం ప్రజాసేవా భవన్ లో మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ 80వ జయంతి వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్ర పటానికి కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఆయన దేశానికి అందించిన విశేష సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా అడ్డి భోజారెడ్డి మాట్లాడుతూ..పేద, బడుగు, బలహీనవర్గాల పెన్నిధిగా వారి అభివృద్ధి, సంక్షేమం కోసం విశేష కృషి చేశారన్నారు. ఆయన హయాంలోనే దేశం శాస్త్రసాంకేతిక రంగాల్లో పురోగతి సాధించిందని గుర్తు చేశారు.
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గిమ్మ సంతోష్, పట్టణ అధ్యక్షుడు గుడిపెల్లి నగేష్ మాట్లాడుతూ ఆదిలాబాద్‌లో రాజీవ్ గాంధీ పేరు మీదనే రిమ్స్ ఆస్పత్రి ఏర్పాటు చేసిన ఘనత కాంగ్రెస్‌దేనన్నారు. ఇవాళ పల్లెపల్లెకు రహదారులు వేయడం ఆయన తీసుకొచ్చిన సంస్కరణలేనన్నారు.
ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు సందా నర్సింగ్, జఫార్ అహ్మద్, తూర్పటి భూమన్న, నాయకులు తుమ్మల వెంకట రెడ్డి, పోరెడ్డి కిషన్ దేవిదాస్ చారి, యెల్టి భోజారెడ్డి, షకీల్,రఫీక్, మహాకాల్ అజయ్, ఖయ్యూం, తమ్మల చందు,శ్రీ రామ్ ,సురేందర్,సమీర్ అహ్మద్,ముఖీమ్, భాస్కర్ రెడ్డి, అల్లాబకష్, రమేష్, తల్లెల రాకేష్, నైతం రమేష్, మహిళా నాయకురాళ్లు ప్రభావతి, ప్రమీల, రూప రోస్లిన్, శ్రీలేఖ తదితరులు పాల్గొన్నారు.